Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోరే ఊరేలా కూరే కావాలా.. అంటోన్న పూర్ణ‌

Advertiesment
నోరే ఊరేలా కూరే కావాలా.. అంటోన్న పూర్ణ‌
, సోమవారం, 29 మార్చి 2021 (13:51 IST)
Sunjay tummala song launch
న‌టి పూర్ణ న‌టించిన `బ్యాక్ డోర్‌`చిత్రంలోని మొదటి పాటను ఇటీవ‌లే పూరి జగన్నాధ్ ఆవిష్కరించడం తెలిసిందే. ఇప్పుడు రెండో పాట "నోరే ఊరేలా... కూరే కావాలా" అనే పల్లవితో.. వంట నేపథ్యంలో సాగే పాటను పాకశాస్త్ర ప్రవీణుడిగా సుప్రసిద్ధులు అయిన వాహ్-చెఫ్ సంజయ్ తుమ్మ విడుద‌ల చేశారు. సంద‌ర్భానుసారంగా వ‌చ్చే ఈపాట‌ను తనతో విడుదల చేయించడం చాలా ఆనందంగా ఉందని సంజయ్ తుమ్మ అన్నారు. ఈ పాట విన్నాక, చూశాక ఈ పాటకు కవర్ సాంగ్ చేయాలనిపిస్తోందని సంజయ్ తెలిపారు. "బ్యాక్ డోర్" చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకున్నారు.
     ప్రణవ్ సంగీత సారధ్యం వహిస్తున్న "బ్యాక్ డోర్" చిత్రంలోని ఈ గీతానికి చాందిని సాహిత్యం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రం ఆడియోను సొంతం చేసుకుంది.
   సంజయ్ తుమ్మ స్పందించిన విధానం చాలా సంతోషంగా ఉందని నంది అవార్డు గ్రహీత-చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రవి శంకర్, కర్రి బాలాజీ దర్శకత్వంలో తదుపరి చిత్రం 'ఆనంద భైరవి' నిర్మిస్తున్న బీరం తిరుపతిరెడ్డి, ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ విజయ.ఎల్.కోట పాల్గొన్నారు.
     పూర్ణ ప్రధాన పాత్రలో ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న 'బ్యాక్ డోర్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొహైల్ జోడీగా రూప కొడువయూర్