Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు సినిమాల్లో ఏముంది.. రొటీనేగా.. ఒకే మూసలో...? నిత్యామీనన్ సెన్సేషనల్ కామెంట్స్

నటనకు ప్రాధాన్యత గల పాత్రల్ని ఎంచుకుంటూ.. స్కిన్ షో, గ్లామర్ రోల్స్, బికినీ రోల్స్‌కు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరు కొట్టేసిన నిత్యామీనన్.. టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక

Advertiesment
nitya menon comments on telugu movies
, మంగళవారం, 19 జులై 2016 (12:42 IST)
నటనకు ప్రాధాన్యత గల పాత్రల్ని ఎంచుకుంటూ.. స్కిన్ షో, గ్లామర్ రోల్స్, బికినీ రోల్స్‌కు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరు కొట్టేసిన నిత్యామీనన్.. టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకే మూసలో గల సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని.. తెలుగులో అయితే సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని చెప్పింది.

హీరో అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. హీరోయిన్ వెంటపడుతూ.. హీరోయిన్‌ను విలన్ దగ్గర నుంచి కాపాడటం చేస్తాడు.. ఇలా చాలా స్టోరీలు తెరపైకి వచ్చాయి. అలాంటి వాటిని బోరింగ్‌గా ఫీలవుతానని నిత్యామీనన్ వెల్లడించింది. 
 
తెలుగు సినిమాలన్నీ ఒకే విధంగా కనిపిస్తాయని నిత్యామీనన్ ఓపెన్‌గా చెప్పేసింది. ఒకే తరహా సినిమాల్లో నటించడం ద్వారా గుర్తింపు రాదని, విభిన్నంగా ఉన్న సినిమాల్లోనే నటిస్తానని తేల్చి చెప్పింది.

తమిళంలో విక్రమ్ సరసన ఓ సినిమాలోనూ, కన్నడలో సుదీప్ సరసన మరో సినిమావో నటిస్తున్నానని.. అవి రెండూ తెలుగులో కూడా రిలీజ్ కానున్నట్లు నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పనితనం నచ్చుతుందని, చాలా నెమ్మదిగా తన పనులు తాను చేసుకోపోతారని.. టెన్షన్ పడరని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' ఎవరు?