''అలా మొదలైంది'' సినిమాతో తెరంగేట్రం చేసిన నిత్యామీనన్.. దాదాపు టాప్ హీరోలతో నటించింది. అయితే చిన్నతనంలోనూ నిత్యామీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించిందనేందుకు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న నిత్యామీనన్.. సూర్య 24లో మెరుగైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
అయితే నిత్య పదేళ్ల నాటికే సినీ ఇండస్ట్రీకి వచ్చేసింది. ఆ మూవీకి సంబంధించి వీడియోలో నిత్యా అందంగా నటించింది. టబు నిత్య చేతులు పట్టుకెళ్లే సీన్స్ అదిరిపోయాయి. ‘ద మంకీ హూ న్యూ టూ మచ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఇంగ్లీష్ చిత్రంలో టబు చెల్లెలిగా నటించింది నిత్యా మీనన్. 1988లో ఈ చిత్రం విడుదల కాగా, ఆ తరువాత మలయాళంలోను అనువదించారు. ఈ సినిమా నిత్యామీనన్ లుక్ క్యూట్‌గా ఉందని నెటిజన్లు అంటున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా అదిరిపోయిందని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.