Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సీన్ తర్వాత రేప్‌ ఇంతహాయిగా చేయవచ్చా అని అనిపించింది: నిత్యా మీనన్

సినిమాల్లో రేప్‌లు చేయడం.. చేసేవాడు విలన్‌గా చిత్రించడం మామూలే. అప్పట్లో మాదాల రంగారావు సినిమాల్లో రేప్‌లు ఎక్కువగా వుండేవి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ వరకు రేప్‌ చేసే క్యారెక్టర్లు భయపట్టేసి.. హింసించడం

Advertiesment
nithya menon
, సోమవారం, 21 నవంబరు 2016 (17:20 IST)
సినిమాల్లో రేప్‌లు చేయడం.. చేసేవాడు విలన్‌గా చిత్రించడం మామూలే. అప్పట్లో మాదాల రంగారావు సినిమాల్లో రేప్‌లు ఎక్కువగా వుండేవి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ వరకు రేప్‌ చేసే క్యారెక్టర్లు భయపట్టేసి.. హింసించడం జరిగేది. కానీ.. పాలిష్‌గా రేప్‌లు ఇలాకూడా చేయవచ్చా! అంటూ నటి నిత్యా మీనన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

మహేష్‌బాబు సినిమాలో.. ఆడు మగాడ్రా! మొక్కలు పేర్చినట్లు.. ఎంత పొందికగా.. కొట్టాడో.. అంటూ.. తనికెళ్ళభరణి డైలాగ్‌ చెప్పినట్లు... సీనియర్‌ నరేష్‌.. నిత్యమీనన్‌ను రేప్‌ చేస్తే.. చాలా పొందికగా.. పాలిష్‌గా చేసినట్లు తనే కితాబిచ్చింది. అసలు రేప్‌ చేసినట్లేతెలీలేదని... చమత్కరించింది. శ్రీప్రియ దర్శకత్వంలో ఇటీవలే విడుదలై 'ఘటన' చిత్రంలో నిత్యా మీనన్‌ను సీనియర్‌ నరేష్‌ రెండుసార్లు రేప్‌ చేస్తాడు. ఈ విషయమై నరేష్‌ మాట్లాడారు.. రెండుసార్లు రేప్‌ చేయాలి.. నరేష్‌ చేయగలడా! అని కొందరు సందేహిస్తే... శ్రీప్రియ.. నా పాత్ర నమ్మకంతో అది నాకే ఇచ్చారు. ఇప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది అని చెప్పారు.
 
ఈ చిత్రం చూశాక... నరేస్‌ తల్లి విజయనిర్మల.. చెంప చెళ్లుమనిపించింది. ఇదేమిటని అశ్చర్యపోకండి... నటుడిగా విలన్‌గా కూడా బాగా చేశావ్‌వంటూ.. ముద్దుగా చెంపమీదకొట్టి.. ఆ తర్వాత ఆశీర్వదించింది.. అని నరేష్ ట్వీట్‌ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా సినిమాలన్నింటికీ నేనొక ప్రేక్షకుడిని : '2.0' చిత్ర దర్శకుడు శంకర్