Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్లిమ్ పేరుతో అరువు అందాలు తెచ్చుకోవడం ఇష్టం లేదు : నిత్యామీనన్

నిత్యామీనన్... నటనే వృత్తిగా ఎంచుకున్న నటి. ఇతరుల కంటే వైరుధ్యభావాలు కలిగిన సినీనటి. అదేసమయంలో పొగరుబోతు కూడా. అయినా డోంట్ కేర్ అనే దమ్మున్న భామ.

Advertiesment
Nithya Menon
నిత్యామీనన్... నటనే వృత్తిగా ఎంచుకున్న నటి. ఇతరుల కంటే వైరుధ్యభావాలు కలిగిన సినీనటి. అదేసమయంలో పొగరుబోతు కూడా. అయినా డోంట్ కేర్ అనే దమ్మున్న భామ. ఈ కేరళ కుట్టికి మణిరత్నం చిత్రం ఓ 'కాదల్ కణ్మణి' చిత్రం వరకూ కోలీవుడ్‌లో అంతగా పేరులేని నాయకి. ఆ చిత్ర విజయంతో మంచి పేరు వచ్చింది. 
 
పాత్ర నచ్చితే చాలు.... అది చిన్నదైనా నటించడానికి సై అంటుంది. అందుకే వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. తాజాగా విక్రమ్‌కు జంటగా 'ఇరుమురుగన్', తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్' అంటూ అగ్రహీరోల సరసన నటిస్తోంది. 
 
అయితే, నిత్యామీనన్ కాస్త పొగరుబోతు. ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అందుకే చెపుతుంది. అవకాశాల కోసం నోరు కట్టుకోవలసిన అవసరం తనకు లేదని అన్నారు. ఆహారంలో ఆంక్షలు విధించుకుని స్లిమ్ అయ్యి అరువు అందాలను కొని తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని చెపుతోంది. తానింతే బొద్దుగా ముద్దుగా ఉంటానని తెగేసి చెపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ట్రెండ్ సెట్టర్' పవన్ కళ్యాణ్ గురించి కొన్ని నిజాలు....