జనతా గ్యారేజ్‌లో సందడి చేసిన నితిన్... సెల్ఫీలతో సందడి!
దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీగా వేసిన సెట్లో ఎన్టీఆర్... సమంతాలపై ఒక పాట
దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీగా వేసిన సెట్లో ఎన్టీఆర్... సమంతాలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అదేసమయంలో నితిన్ అక్కడికి వెళ్లాడు. 'జనతా గ్యారేజ్' టీమ్‌లో చేరి సందడి సందడి చేశాడు. ''అ.. ఆ...'' మూవీ హిట్‌తో మంచి ఊపుమీదున్న నితిన్ చాలా కాలం తర్వాత తారక్‌ను కలిశాడు.
ఈ సందర్భంగా సినిమాల గురించి ఇద్దరూ కాసేపు కబుర్లాడుకున్నారు. కాగా, ఎన్టీఆర్‌తో కలిసి దిగిన సెల్ఫీని నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ చూడటం చాలా ఆనందంగా ఉందని సోషియల్ మీడియాలో ట్వీట్ చేశారు. 'అ.. ఆ...' హిట్ అయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఆయన ఎన్టీఆర్‌తోను.. కొరటాలతోను పంచుకున్నాడు. అంతేకాకుండా యంగ్ టైగర్ డ్యాన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని నితిన్ తెలిపారు.