ఆడపిల్లల్లో ప్రేమ విషయంలో మార్పు వస్తుంది... నిహారిక
మెగా కాంపౌండ్ నుంచి యాంకర్‌గా, వెబ్ సిరీస్ నటిగా మనకు సుపరిచితురాలు అయిన నిహారిక ఇప్పుడు రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఒక మనసు చిత్రంతో మెగా వారసురాలిగా మనకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయ
మెగా కాంపౌండ్ నుంచి యాంకర్‌గా, వెబ్ సిరీస్ నటిగా మనకు సుపరిచితురాలు అయిన నిహారిక ఇప్పుడు రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఒక మనసు చిత్రంతో మెగా వారసురాలిగా మనకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న నటిగా ఫ్యాన్స్‌కు ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వివిధ జిల్లాల నుంచి 200కు పైగా వచ్చిన మహిళా అభిమానులతో నిహారిక ముచ్చటించి, వాళ్ల ప్రశ్నలకు జవాబులిచ్చింది.
ఆ ముచ్చట్లు ఆమె మాటల్లో.. నా నుంచి వచ్చే ఏ సినిమా వల్ల అయినా అభిమానులకు గానీ, మా ఫ్యామిలీకి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. మెగా వారసులను ఆశీర్వదించినట్టుగా నన్ను కూడా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను. ఒక మనసు గురించి చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది. నా మొదటి చిత్రంకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం నిజంగా నా అదృష్టం. ఈ చిత్రం తర్వాత ఖచ్చితంగా ఆడపిల్లల్లో ప్రేమ విషయంలో మార్పు వస్తుంది.
ఫ్యామిలీ అంతా వెళ్లి చూసేలా ఒక మనసు ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కూడా ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. నాగశౌర్యతో చేయడం చాలా హ్యాపీ. ఇప్పటికే పాటలను కొన్ని లక్షల మంది విన్నారు. నిజంగా అద్భుతమైన పాటలు ఇచ్చాడు సునీల్ కశ్యప్. నాకోసం ఇంతదూరం వచ్చిన మా మెగా అభిమానులందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ నెల 24న ఒక మనసుతో థియేటర్‌లో కలుద్దాం.