పెళ్ళయ్యాక సినిమాలు చేయనని.. అమ్మే తనకు రోల్ మోడల్ అంటూ మెగా డాటర్ నిహారిక వెల్లడించింది. ఇంకా తన పెళ్ళి విషయంలో నిర్ణయం మాత్రం.. అధికారం పూర్తిగా అమ్మకేనని నిహారిక చెప్తోంది. తనకు స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకు.. తన పెళ్లి చేసే అధికారం ఇచ్చేశానని.. తనకు స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకు తనకు పెళ్లి చేసే అధికారం ఇచ్చేశానని చెప్తోంది. గృహిణిగా మా అమ్మే తనకు రోల్ మోడల్ అని.. తాను కూడా పెళ్లయ్యాక పిల్లల్ని పెంచడం.. కుటుంబాన్ని చూసుకుంటానని తెలిపింది.
మదర్స్ డే సందర్భంగా తల్లితో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటోతో పాటు పెళ్లి గురించి నిహారిక నిజాలు చెప్పేసింది. అంతేగాకుండా తన తొలి సినిమా ఒక మనసు గురించి నిహారిక మాట్లాడుతూ. ఇంట్లో అందరినీ ఒప్పించి హీరోయిన్‌గా మారిన విషయాన్ని వెల్లడించింది. ఒక మనసు రిలీజ్ రిజల్ట్‌పై టెన్షన్‌గా ఉన్న మాట నిజమేనని నిహారిక అంటోంది.
నెగటివ్‌గా ఫీడ్ బ్యాక్ వచ్చినా.. వ్యక్తిగతంగా తానేమీ కుంగిపోనని ధైర్యంగా చెప్తుంది. ఇప్పటివరకు రెండో సినిమాకు సంతకాలు చేయకపోవడానికి.. తొలి సినిమా ఫలితం కోసం వేచి చూడటమే కారణమని నిహారిక వెల్లడించింది.