Varun Tej, Lavanya Tripathi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. తన అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో నిహారిక తెగ సందడి చేసింది. ఇంకా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేగాకుండా ఈ రోజు కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నా.. అని చెప్తూ.. వెల్‌కమ్ వదినా.. అంటూ ముగించింది.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరైనారు. నిహారికతో పాటు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత కొణిదెల, శ్రీజ సహా పలువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.