Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నా చెల్లెళ్లులా పెరిగాం, మాకు పెళ్లా. నీహారికతో తన వివాహంపై సాయిధరమ్ వివరణ

నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు సాయిధరమ్ తేజ్‌ను తీవ్రంగా బాధించాయి. అన్నాచెల్లెళ్లులా కలిసి మెలిసి పెరిగిన తమకు పెళ్లి జరుగనున్నట్లు వార్తలు రావడంపై తేజ్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను

Advertiesment
అన్నా చెల్లెళ్లులా పెరిగాం, మాకు పెళ్లా. నీహారికతో తన వివాహంపై సాయిధరమ్ వివరణ
హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (07:04 IST)
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్, చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు కుమార్తె, హీరోయిన్ నీహారికలు ఓ ఇంటివారు కాబోతున్నారంటూ సోమవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన వార్తకు తెర పడింది. నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు సాయిధరమ్ తేజ్‌ను తీవ్రంగా బాధించాయి. అన్నాచెల్లెళ్లులా కలిసి మెలిసి పెరిగిన తమకు పెళ్లి జరుగనున్నట్లు వార్తలు రావడంపై తేజ్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు కనీసం ధ్రువీకరించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
 
వరుసకు మరదలైన నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో తనకు త్వరలో వివాహం జరగనుందని వచ్చిన వార్తలను హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఖండించారు. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధితో ఓ ప్రకటన విడుదల చేశారు. నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు తనను బాధించాయని తెలిపారు. చిన్నతనం నుంచి ఒకే కుటుంబలో కలిసిమెలిసి పెరిగామని ఒకరినొకరం అన్నాచెల్లెళ్లుగా భావిస్తామని వివరించారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఆధారం లేని వార్తలు ఎదుటివారి మనో భావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.
 
చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడు సాయి ధరమ్‌ తేజ్‌. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక. వీరిద్దరు వీరిద్దరు వరుసకు బావామరదళ్లు కూడా. వీరిద్దరు పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సోషల్ మీడియా కారుకూతలు కూసింది. నిహారిక, సాయి ధరమ్‌ తేజ్‌ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారని, అంతేతప్ప, వారిద్దరి మధ్య సహజంగానే సాన్నిహిత్యం అనేది ఉంటుందని, పెళ్లివార్త పుకార్లే అని సాయిధరమ్ స్నేహితులు వెంటనే స్పందించినప్పటికీ నష్టం జరిగిపోయింది.
 
అన్యాయంగా సెలబ్రిటీల జీవితాలపై అపనిందలు వేస్తున్న ఇలాంటి ముష్కర కథనాలను, ప్రసారం చేస్తున్న చానెళ్లను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలబ్రిటీలనే కాదు వాళ్ల కూతుళ్లను కూడా లాగుతున్న యూట్యూబ్ చానెళ్లు