ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ చిక్కింది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఇద్దరి హీరోయిన్లకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీ, అలాగే టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గతంలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా ఝళిపిస్తున్న నైపథ్యంలో తెరపైకి ఈ హీరోయిన్ల పేర్లు రావడం ఆసక్తికరంగా మారింది.
అందులో హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటిస్తున్న నిధి అగర్వాల్.. JeetWin అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు కనిపించింది. వాటిని వీ.సీ సజ్జనార్‌కి ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిపై సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారో.. పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో అని పలువురు చర్చించుకుంటున్నారు.