Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయిః రాజేంద్ర ప్రసాద్

anukoni prayanam team
, గురువారం, 27 అక్టోబరు 2022 (17:20 IST)
anukoni prayanam team
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది.  
 
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ  'అనుకోని ప్రయాణం'అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు. 45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది. ఆనలుగురు లాంటి సమాంతర చిత్రాలు ఇండియాలో వందరోజులు ఆడాయి. ఇలాంటి ఎన్నో పరిక్షలు నేను ఎదురుకున్నాను. నా నట జీవితంలో అన్ని రకాల పాత్రలు చేశాను. దీనికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నరసింహ రాజు గారితో పాటు అన్నీ పాత్రలు గుర్తుంటాయి.  'అనుకోని ప్రయాణం' లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒక అద్భుతంలా వచ్చే కథలివి. 28న సినిమా విడుదలౌతుంది. అద్భుతమైన, అమూల్యమైన అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. దయచేసి అందరూ ఫ్యామిలీ తో కలసి థియేటర్లో చూడండి'' అని కోరారు.
 
నిర్మాత డా.జగన్ మోహన్ డి వై మాట్లాడుతూ.. అంతా కొత్తవారితో సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. అలాంటి గట్స్ వున్న నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడా ఒక్క అవాంతరం లేకుండా సినిమా పూర్తి చేశాం. అయితే షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ గారు కొంత ఎత్తు నుండి కిందకు పడ్డారు. అయితే దానిని లెక్క చేయకుండా షూటింగ్ ని కంటిన్యూ చేశారు. అనుకోని ప్రయాణం' మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఇది. నరసింహ రాజు గారికి కృతజ్ఞతలు. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది'' అన్నారు
 
నరసింహ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో రెండేసి సినిమాలు చేశాను. వారిలో గొప్ప పట్టుదల కృషి వుంటుంది. ఒక లక్ష్యం గమ్యం తో పని చేసే గొప్ప నటులు వారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ఇందులో భాగం కావడం ఆనందంగా వుంది. అనుకోని ప్రయాణంలో చాలా మంచి నటీనటులు వున్నారు. సాంకేతిక నిపుణులు అంతా యంగ్ స్టర్స్. చాలా అద్భుతంగా చేశారు.  సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.'' అన్నారు.
 
ప్రేమ మాట్లాడుతూ : చాలా రోజుల తర్వాత పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.  రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేయడం మంచి అనుభవం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా లో చాలా మంచి ఫీల్ వుంటుంది. అక్టోబర్ 28న సినిమా విడుదలౌతుంది. మీ అందరూ చూసి అనందించాలి'అని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1989 కుప్పంలో జరిగిన క‌థ‌తో సుధీర్ బాబు 18వ చిత్రం