Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రాధేశ్యామ్" నుంచి సరికొత్త పోస్టర్

Advertiesment
, బుధవారం, 13 అక్టోబరు 2021 (12:11 IST)
ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే కొత్త పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ - ప్రమోద్ - ప్రశీద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా మీద బాగా అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో బుధవారం హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా, ఇందులో ప్రేరణగా నటిస్తున్న ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఇక ఈ పోస్టర్‌లో పూజా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఒకవైపు తిరిగి స్మైల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులనే కాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా 'రాధే శ్యామ్' 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' ... పుష్ప నుంచి మరో ఆడియో సాంగ్ రిలీజ్