Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రారంభ‌మైన నెల్సన్

Sai Sunil Nimmala, Jayant, Anusha Roy
, గురువారం, 12 మే 2022 (16:48 IST)
Sai Sunil Nimmala, Jayant, Anusha Roy
సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.  జయంత్ ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా "నెల్సన్" పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో మొదలైంది. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.
 
త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్‌లలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సౌండ్ ఎఫెక్ట్స్: పురుషోత్తమరాజు, పాటలు: కాసర్ల శ్యామ్-మనోజ్-గిరి-జయంత్-సాయి సునీల్, సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: శివ దేవరకొండ, ఫైట్స్: శివ్ రాజ్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, నిర్మాత: జయంత్ కార్తీక్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యక్తిత్వంతో స్టార్స్‌కు సన్నిహితులయిన బి.ఎ.రాజు