నగ్నంగా తిరుగుతూ.. పొరుగింటి యువతికి వేధింపులు..స్క్రిప్ట్ రైటర్‌కు మూడేళ్ల జైలు
సినీ పరిశ్రమలో లైంగిక దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇప్పటికే హీరోయిన్లపై లైంగిక దాడుల ఘటనలు, వేధింపులు.. ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో.. నగ్నంగా కనిపించి ఓ యువతిని లైంగిక వేధించిన మలయాళ క
సినీ పరిశ్రమలో లైంగిక దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇప్పటికే హీరోయిన్లపై లైంగిక దాడుల ఘటనలు, వేధింపులు.. ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో.. నగ్నంగా కనిపించి ఓ యువతిని లైంగిక వేధించిన మలయాళ కథారచయితకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ నటించిన నీలాకాషం పచ్చకడల్, చువన్న భూమి వంటి సినిమాలకు కథారచయితగా పనిచేసిన హషీర్ ముహ్మద్ పనిచేశాడు.
ఇతడు గత 2014వ ఏడాది.. తన అపార్ట్‌మెంట్ ఆవరణలో నగ్నంగా తిరుగుతూ.. పొరుగింటి యువతిని లైంగికంగా వేధించాడు. ఆపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. గంజాయి తీసుకున్న కారణంగా హషీర్ ఇలా ప్రవర్తించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుపై ఎర్నాకులం కోర్టులో మూడేళ్ల పాటు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో హషీర్ ముహ్మద్‌కు మూడేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.