Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారిపై పిడుగుద్దులు.. ఈ మహిళలు ఏం సాధించాలని..? రష్మీ గౌతమ్ ఫైర్

Advertiesment
చిన్నారిపై పిడుగుద్దులు.. ఈ మహిళలు ఏం సాధించాలని..? రష్మీ గౌతమ్ ఫైర్
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:36 IST)
తాజాగా ఓ మహిళ ఏడాదిన్నర వయస్సు ఉండే అభం శుభం తెలియని చిన్నారికి నరకం చూపించింది. పిడి గుద్దులు గుద్దడంతో పాటు కొవ్వొత్తి నుంచి కారే వేడి ద్రవాన్ని ఆ చిన్నారి సున్నితమైన చిన్మారిపై పోస్తూ రాక్షసానందం పొందింది. ఆ బాధకు చిన్నారి విలవిలలాడుతున్నా కూడా మహిళ మనసు కరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
వీడియో చూసిన నెటిజన్స్ చలించిపోవడంతో పాటు ఆ మహిళని చంపేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో రష్మీ కూడా చేరింది. రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ.. 'ఈ మహిళలు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారో అస్సలు అర్థం కావడంలేదు. దయచేసి ఎవరైనా సంబంధిత శాఖను, స్వచ్ఛంద సంస్థలను, బాలల సంరక్షణ కేంద్రాలను ట్యాగ్ చేయండి'' అని రష్మి కోరారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరపైకి శ్రీదేవి బయోపిక్.. హీరోయిన్‌గా 'గీతగోవిందం' భామ??