Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫస్ట్ డే ఫస్ట్ షో' నుండి నీ నవ్వే లిరికల్ వీడియో విడుదల

Srikanth Reddy, Sanchita Bashu
, మంగళవారం, 26 జులై 2022 (16:34 IST)
Srikanth Reddy, Sanchita Bashu
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
 
సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విడుదల ఫస్ట్ సింగల్, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో 'నీ నవ్వే' పాటని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.
హీరో తన ప్రేయసి ప్రేమ ఊహల్లో తేలుతున్న ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంది. ఈ పాటకు రాధన్ కంపోజ్ చేసిన ట్యూన్ చాలా యూత్ ఫుల్ గా వుంది. రామ్ మిరియాల పాడిన ఈ పట హుషారుగా సాగింది.
 
♪♪కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి
సూటిగా సాగిపొమ్మని
ఆశగా తెల్లవారుతుంది రాతిరి
నిండుగా రేపు నాదని
నీ నవ్వే నీ చిరునవ్వే
నే కోరే వెన్నెల
ఏదైనా సాధిస్తాలే
తోడుంటే నువ్విలా
సాహసం చేయనా... నీ కోసం
దించనా నీ కోసం... అందని ఆకాశం♪ ♪
రామజోగయ్య శాస్త్రి పాటకు అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. లిరికల్ వీడియోలో చూపించిన షూటింగ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కూల్ ఫెర్ఫార్మెన్స్, సంచితా బషు క్యూట్ స్మైల్ అలరిస్తున్నాయి.    
 
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్,  సాయి చరణ్ బొజ్జ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"పుష్ప" తాజా స్టిల్స్.. కేక.. కేక.. (ఫోటోలు)