ఇండస్ట్రీలో నయీం పెట్టుబడులు... సి.కళ్యాణ్.. బషీద్.. మరెవరో..
మాజీ నక్సలైట్.. రౌడీ.. దందాలు చేసే గ్యాంగ్‌స్టర్ నయీం. ఆ తర్వాత పోలీసులు చేసిన పరిశోధనలో సినిమా రంగంలోనూ పెట్టుబడుటు పెట్టారని వెల్లడించారు. ఆ తర్వాత ఎందుకనో పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు.
మాజీ నక్సలైట్.. రౌడీ.. దందాలు చేసే గ్యాంగ్‌స్టర్ నయీం. ఆ తర్వాత పోలీసులు చేసిన పరిశోధనలో సినిమా రంగంలోనూ పెట్టుబడుటు పెట్టారని వెల్లడించారు. ఆ తర్వాత ఎందుకనో పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. అసలే పోలీసుల్లో కూడా నయీంకు లింకులు వుండడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయాత్నాలు జరుగుతున్నాయి తెలుస్తోంది.
సో.. ఏదిఏమైనా చలన చిత్రరంగంలోనూ నయీంకు లింకులున్నాయనీ ఆయన కొందరికి పెట్టుబడులు పెట్టారంటూ కొన్ని సినిమాలు తీశారనే విషయాన్ని నిర్మాత నట్టికుమార్ వెల్లడించనున్నారు. ఆల్‌రెడీ నట్టికుమార్ అంటే ఇండస్ట్రీలోని ఆ నలుగురు ట్రెండ్.. నిర్మాతలకు హడల్.. చిన్న నిర్మాతలందరినీ పోగుచేసి.. సినిమా థియేటర్ల దొరకడంలేదనీ.. టాక్స్‌లు బాగా వేస్తున్నారనీ.
గతంలో పలుసార్లు దీక్షలు కూడా చేశాడు. అయితే ఈసారి నయీం లింకులు బయటపెడతానంటూ నట్టికుమార్ వెల్లడిస్తున్నాడు. ఆ వివరాలు.. ఒకేసారి మీడియాకు చెబుతానంటూ మెసేజ్‌లు ఇచ్చాడు. కాగా, ఇప్పటికే ఎవరిగురించి చెబుతాడోనంటూ నట్టికుమార్‌ను పలువురు ఫోన్లలో సంప్రదించినట్లు తెలిసింది. కొద్దిగంటల్లో ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతాడో చూడాల్సింది.
కాగా, ఇప్పటికే భాను అనే రౌడీ ఇష్యూల్లో సి.కళ్యాణ్ బినామీగా ఉన్నాడని వార్త రావడం దాన్ని నిరూపించుకోకపోవడంతో కళ్యాణ్. బయటపడటం జరిగింది. అయితే ఇటీవలే బషీద్ పేరుతో పలు చిన్న చిత్రాలు వస్తున్నాయి. బహుశా, అతనే అయివుంటాడని ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. సత్వర వివరాలకు వెబ్‌దునియాను చూడండి.