Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 7న డోర పాటలు... నయనతార నటన ఆకట్టుకుంటుందట...

ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగు

Advertiesment
Nayanatara dora movie latest news
, శుక్రవారం, 3 మార్చి 2017 (20:16 IST)
ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. కాగా ఈ నెల 7న  ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ విభిన్న కథ, కథనాలతో తెరకెక్కుతున్న హారర్ చిత్రమిది. నయనతారకు వున్న క్రేజ్‌తో ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. డోర అనే పేరు వెనకున్న రహస్యమేమిటనేది తెరపై ఉత్కంఠను పంచుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి సన్నివేశం థ్రిల్‌ను కలిగిస్తుంది. నయనతార నటన, పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటాయి. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. 
 
నవ్యతతో కూడిన కథాబలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం.  ఇటీవలే విడుదలైన తమిళ టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ నెల 7న  చిత్ర పాటలను విడుదల చేసి త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నష్టాల్లో 'సప్తగిరి'.. అయినా మరోసారి ట్రై చేస్తున్నాడు!