నయనకు ఏమైంది? అందరితో సై అంటోందే.. ఆమెనలా మార్చిందెవరు?
ఇప్పటికే ప్రేమ విషయంలో రెండు సార్లు ఓడిపోయిన నయనతార సుదీర్ఘ విరామం తర్వాత తన పాత ప్రియులతో నట జీవితం మొదలుపెట్టింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివతో సహజీవనం చేస్తోందని పుకార్లకు గురవుతున్న నయనతార ఆశ్చర్యకరంగా శింబుతో ఒక సినిమాలో ఇప్పటికే నటించేసింది.
మనస్ఫూర్తిగా ఇష్టపడిన వారితో జీవితం పంచుకునే విషయంలో నయనతార అంత దురదృష్టవంతురాలు దక్షిణాది చిత్రపరిశ్రమలో మరెవ్వరూ ఉండరు. తానెంత ఇష్టంతో దగ్గరయినా ఏదో ఒక రకంగా ఆమె నమ్మకాన్ని, అభిమానాన్ని బద్దలు గొట్టి జీవితంపొడవునా అందరూ ఆమెకు చేదు వాస్తవాలను చూపించినవారే, ఇప్పటికే ప్రేమ విషయంలో రెండు సార్లు ఓడిపోయిన నయనతార సుదీర్ఘ విరామం తర్వాత తన పాత ప్రియులతో నట జీవితం మొదలుపెట్టింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివతో సహజీవనం చేస్తోందని పుకార్లకు గురవుతున్న నయనతార ఆశ్చర్యకరంగా శింబుతో ఒక సినిమాలో ఇప్పటికే నటించేసింది. శింబు ఆమెను ఘోరంగా అవమానించిన వ్యక్తి. అలాంటి వాడినే క్షమించేసిన నయన ఇప్పుడు మరో బాంబులాంటి వార్తకు కేంద్ర బిందువైపోయింది.
తన మాజీ ప్రియుల్లో ఒకరైన సంచలన నటుడు శింబుతో ఇదునమ్మఆళు చిత్రంలో నటించిన నయనతారను ఇప్పుడు రెండో మాజీ ప్రియుడు ప్రభుదేవాతో నటింపజేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుదేవా కూడా ఇటీవల కోలీవుడ్‌లో నటుడు, దర్శకుడిగా బిజీ అయ్యారు. ఇకపోతే ఈయన అంగీకరించిన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ హ్యాండిల్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో కన్నడ నటి సంయుక్తను కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమెను కాదని నటి నయనతారను ప్రభుదేవాకు జంటగా నటింప జేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త.
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో ఒకటైన కోలైయుధీర్ కాలంలో విలన్‌గా ప్రభుదేవాను నటింప జేసే ప్రయత్నాలు చేయగా అందుకు ఈ అమ్మడు సుముఖం వ్యక్తం చేయలేదనే ప్రచారం జరిగింది. దీంతో అదే చిత్రం హిందీ వెర్షన్‌లో ప్రభుదేవా ప్రతినాయకుడిగా నటిస్తుండగా నటి తమన్నా నాయకిగా నటిస్తుండడం విశేషం. అలాంటిది ఇప్పుడు కార్తీక్‌సుబ్బరాజ్ తను చిత్రంలో ప్రభుదేవాను, ఆయన మాజీ ప్రియురాలిని కలపడం సాధ్యం అవుతుందా అయితే ఇక్కడ అసాధ్యానికి తావు ఉండదు. పారితోషికం బాగా పనిచేస్తుంది. మరి అది ఇక్కడ ఈ మాజీ ప్రేమజంటను కలుపుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.