Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి 2 అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం.. బాలీవుడ్ సహజనటుడు సిద్ధీఖి ప్రశంసలు

విడుదలై అయిదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాహుబలి 2 ప్రభంజనం తగ్గడం లేదు. అయిదోవారం కూడా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయని సమాచారం. మరోవైపున సినిమాను ప్రశంసిస్తున్న ప్ర

బాహుబలి 2 అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం.. బాలీవుడ్ సహజనటుడు సిద్ధీఖి ప్రశంసలు
హైదరాబాద్ , సోమవారం, 29 మే 2017 (06:09 IST)
విడుదలై అయిదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాహుబలి 2 ప్రభంజనం తగ్గడం లేదు. అయిదోవారం కూడా సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయని సమాచారం. మరోవైపున సినిమాను ప్రశంసిస్తున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ సహజ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి ఈ కోవలో చేరిపోయారు. బాహుబలి2 సినిమాపై కల్పించబడిన వాతావరణం ఎలా ఉందంటే సినిమా  చూడకుండా ఉండలేకపోయాననేశాడు. నిజంగానే బాహుబలి అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం అని ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. గ్యాంగ్స్ ఆప్ వాసెపూర్, తలాష్, మాంజి వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన సహజనటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. 
 
ఇప్పటికే రిషికపూర్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు బాహుబలి2పై అభినందనలు తెలిపారు. బాహుబలి 2 ఇంకా దేశంలో, విదేశాల్లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నెలరోజుల్లో 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన బాహుబలి తమిళనాడులో రోబోను మించి అత్యధిక కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. కేరళ చరిత్రలో అత్యధిక కలెక్షన్ల రికార్డు కూడా బాహుబలి 2 పేరుతో నమోదైంది.  
 
అయిదో వారంలో కూడా థియేటర్లలోకి జనాలను రప్పిస్తున్న బాహుబలి-2 చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1600 కోట్లు సాధించింది. నెలరోజుల తర్వాత కూడా మహానగరాల్లో మల్టీఫ్లెక్స్‌లలో, ఐమాక్స్ థియేటర్లలో ఇంకా హౌస్ పుల్ కలెక్షన్లు రాబడుతున్న అరుదైన చరిత్రకు బాహుబలి-2 సాక్షీభూతమై నిలుస్తోంది.
 
Nawazuddin Siddiqui ✔ @Nawazuddin_S
I had seen Bahubali 2 and the atmoshphere created in the film pulled me into it.
Prabhas's act was fantastic.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి2 సినిమాపై నా భయాన్ని మొత్తంగా పొగొట్టిన కాంప్లిమెంట్ అది: రాజమౌళి