Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' జయలలితకు అంకితం

రావు రమేష్‌, హెబ్బా పటేల్‌, తేజస్వి మడివాడ, అశ్విన్‌, పార్వతీశం, నోయెల్‌ సేన్‌ ప్రధాన తారాగణంగా లక్కీమీడియా బ్యానర్‌పై భాస్కర్‌ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'. ఈ చిత్రాన్ని ఇటీవలే మరణ

Advertiesment
Nanna Nenu Naa Boyfriends Movie
, గురువారం, 8 డిశెంబరు 2016 (18:17 IST)
రావు రమేష్‌, హెబ్బా పటేల్‌, తేజస్వి మడివాడ, అశ్విన్‌, పార్వతీశం, నోయెల్‌ సేన్‌ ప్రధాన తారాగణంగా లక్కీమీడియా బ్యానర్‌పై భాస్కర్‌ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'. ఈ చిత్రాన్ని ఇటీవలే మరణించిన జయలలితకు అంకితమిస్తున్నట్లు పంపిణీదారుడు, నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలు రామానాయుడు స్టూడియోలో విడులయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 
దిల్‌ రాజు మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని జయలలితగారికి అంకితమిస్తున్నా. శేఖర్‌ చంద్రపతి సాంగ్‌ను డిఫరెంట్‌గా చేశాడు. టీం బాగా కష్టపడి చేశారు. సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. హెబ్బా కోసం యూత్‌ సినిమా చూస్తారు. కూతురున్న తండ్రి ఈ సినిమా చూస్తారు. అలాగే ప్రతి అమ్మాయి ఈ సినిమా చూస్తుంది. మంచి తండ్రి కూతుళ్ల మధ్య మంచి అనుబంధం ఉండే సినిమా. మ్యూజిక్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్నీ కుదిరిన సినిమా. ఈ నెల 16న సినిమా రిలీజ్‌ అవుతుందని అన్నారు.
 
దర్శకుడు భాస్కర్‌ బండి మాట్లాడుతూ... దిల్‌రాజుగారు సినిమా చూసి బావుందనడమేకాకుండా సినిమాను విడుదల చేస్తున్నారు. హెబ్బా, తేజస్విని, నోయెల్‌, అశ్విన్‌బాబు, పార్వతీశం అందరూ సినిమా కోసం చక్కగా పనిచేశారని అన్నారు. మాటల రచయిత ప్రసన్నకుమార్‌ తెలుపుతూ... ఆరు నెలల క్రితం గోపిగారు ఈ కథను నాకు వినిపించారు. కథలో నాన్న అనే క్యారెక్టర్‌ సినిమాను చాలా ముందుకు నడిపించింది. సినిమా చూసిన తర్వాత ప్రతి కూతురు తండ్రి చేయిని ప్రేమగా పట్టుకుంటుంది. రెండు గంటల పాటు పూర్తిగా నవ్విస్తుంది. చివరి ఇరవై నిమిషాలు హృద్యంగా ఉంటుందని అన్నారు.
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినిమాను నమ్మి సినిమా చేసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి తక్కువ మందిలో దిల్‌రాజు ఒకడైతే, బెక్కం వేణుగోపాల్‌ మరో నిర్మాతలు. వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి సినిమా తప్పకుండా మంచి హిట్‌ అవుతుంది. డైలాగ్‌ రైటర్‌ ప్రసన్నలో మంచి ఫ్యూచర్‌ రైటర్‌ కనపడ్డాడని అన్నారు.
 
నోయెల్‌ మాట్లాడుతూ... నటుడు కావాలని సింగర్‌ అయ్యాను. ఇప్పుడు మళ్లీ నటుడ్ని అయ్యాను. నవీన్‌, రవివర్మ, కీరవాణి సహా చాలా మంది సపోర్ట్‌తోనే నేను ఈ స్థాయిలో నిలబడుతున్నానని అన్నారు. శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ.. దర్శకులు నాకు కావాల్సినంత ఫ్రీడం ఇచ్చి మ్యూజిక్‌ చేయించుకున్నారు. సాంగ్స్‌ అందరికీ నచ్చుతాయని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 10న అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావుల 'ఓం నమో వేంకటేశాయ'