'నాన్న- నేను - నా బాయ్ ఫ్రెండ్స్' అంటున్న హెబ్బా పటేల్
ఆ అమ్మాయికి వాళ్ల నాన్నంటే ప్రాణం. తండ్రికి కూతురంటే ఆరో ప్రాణం. పుట్టినప్పటి నుంచి పాదం కందకుండా పెంచుతాడు కుమార్తెను. అలాంటిది అమ్మాయికి ఈడొచ్చాక బాయ్ ఫ్రెండ్స్ అనే పేరుతో ఆమె జీవితంలోకి ముగ్గురొ
ఆ అమ్మాయికి వాళ్ల నాన్నంటే ప్రాణం. తండ్రికి కూతురంటే ఆరో ప్రాణం. పుట్టినప్పటి నుంచి పాదం కందకుండా పెంచుతాడు కుమార్తెను. అలాంటిది అమ్మాయికి ఈడొచ్చాక బాయ్ ఫ్రెండ్స్ అనే పేరుతో ఆమె జీవితంలోకి ముగ్గురొస్తారు. ఇంతకీ ఎవరా ముగ్గురు? ఆ ముగ్గురి పట్ల ఆమె తండ్రికున్న అభిప్రాయం ఏంటి? అసలు ఆ అమ్మాయి `నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్` అని ఎందుకు చెప్పింది? ఎవరితో చెప్పింది? ఆ చెప్పిన దాన్లో ఉన్న అంతరార్థం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం `నాన్న- నేను - నా బాయ్ ఫ్రెండ్స్`.
ఈ చిత్రం లక్కీ మీడియా పతాకంపై రూపొందింది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మానస, మహాలక్ష్మి ఈ చిత్రానికి సమర్పకులు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్ బాబు, పార్వతీశం, నోయల్ సేన్ కీలక పాత్రల్లో నటించారు. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత. భాస్కర్ బండి దర్శకత్వం వహించారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ... మా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే వారం పాటల్ని విడుదల చేస్తాం. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర సంగీతం చేసిన పాటలు కూడా అందరి మన్ననలు పొందుతాయనే నమ్మకం ఉంది. మంచి బాణీలిచ్చారాయన. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. సినిమాకు ప్లస్ అవుతాయి. డిసెంబర్ 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దిల్‌రాజుకి మా సినిమా చాలా బాగా నచ్చింది. ఆయనే సినిమాను విడుదల చేస్తున్నారు అని తెలిపారు.