Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది... నాని

ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది... నాని
, శుక్రవారం, 22 మార్చి 2019 (22:09 IST)
నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా `హిప్పీ` టీజ‌ర్ విడుద‌లైంది. `RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. ఈ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ... ``కార్తికేయ‌తో క‌లిసి `గ్యాంగ్ లీడ‌ర్‌`లో ప‌నిచేస్తున్నాను. 
 
`ఆర్ ఎక్స్ 100` గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడ‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అత‌నితో క‌లిసి ప‌నిచేస్తుంటే... ఆ సినిమా ఎందుకు అంంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది. కార్తికేయ‌తో ప‌నిచేయ‌డం చాలా స‌ర‌దాగా ఉంది. 
 
ఈ ప‌రిచ‌యంతోనే నేను `హిప్పీ` టీజ‌ర్‌ విడుద‌ల చేశాను. `హిప్పీ` టీజ‌ర్‌ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా బావుంది. స‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ ల‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుంద‌నిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ స‌మ్మ‌ర్‌లో త‌ప్ప‌కుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందని న‌మ్ముతున్నా`` అని అన్నారు.
 
కార్తికేయ మాట్లాడుతూ... ``నాని సార్‌తో ప‌నిచేసే ఛాన్స్ నాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` చిత్రంతో వ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌న చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకున్నా. నేను అడ‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. `నేను అడ్వాంటేజ్ తీసుకోవ‌ట్లేదు క‌దా సార్‌` అని అన్నా. `నువ్వు అడ‌క్క‌పోయినా చేసేవాడిని` అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్య‌క్తి ఆయ‌న. 
 
షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఆయ‌న బాగా క్లోజ్ అయ్యారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక `నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియ‌దు` అని అనుకుంటున్న త‌రుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా`` అని అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ... ``మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసినందుకు నాని సార్‌కు చాలా ధ‌న్య‌వాదాలు. ఆయ‌న‌తో పాటు నేను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌గారికి ధ‌న్య‌వాదాలు చెప్పాలి. విక్ర‌మ్‌గారి షూటింగ్‌లో ఉండ‌గానే మేం నానిగారితో టీజ‌ర్ విడుద‌ల చేయించాం`` అని అన్నారు. విక్ర‌మ్‌.కె.కుమార్ మాట్లాడుతూ.. ``కార్తికేయ‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు మంచి స్నేహితుడు. టీజ‌ర్ చూస్తుంటే మంచి ఫ‌న్ రైడ్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి. మంచి టీమ్ క‌లిసి చేసిన చిత్ర‌మిది`` అని తెలిపారు. 
 
నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ... ``రెండు పాట‌లు మినహా షూటింగ్ పూర్త‌యింది. ఒక పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాట‌ను ప‌బ్బులో చిత్రీక‌రిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు ఈ షూటింగ్ ఉంటుంది. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌రీతిలో నిర్మిస్తున్నాం. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం`` అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్‌కి అమ్మ‌గా న‌టిస్తున్న 'నిన్నేపెళ్లాడుతా' తార..