Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నందిత శ్వేత సైబర్ క్రైమ్ థ్రిల్లర్ OTP ప్రారంభం

Nandita Swetha clap by sriramchandra
, గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:54 IST)
Nandita Swetha clap by sriramchandra
జె. ఆర్. పిక్చర్స్, మిధున ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నందిత  శ్వేత, రామ్ జంటగా సూర్య తేజ్, డి. జె. టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ నటీ నటులుగా కళ్యాణ్ కుమార్ దర్శకత్వంలో యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ "OTP". ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రాక్ క్యాస్టిల్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన స్టార్ కమెడియన్ అలీ స్క్రిప్ట్ అందించగా, ఇండియన్ ఐడిల్ విన్నర్ శ్రీ రామచంద్ర చిత్ర హీరో హీరోయిన్ లపై చిట్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, చిత్ర నిర్మాత కూతురు బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
 
అనంత‌రం ఇండియన్ ఐడల్ శ్రీ రామచంద్ర మాట్లాడుతూ... నందిత  శ్వేత బ్రిలియంట్ ఆర్టిస్ట్.ఇప్పటి వరకు తను చాలా మంచి సినిమాలు చేసింది. OTP వంటి  మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ,  కళ్యాణ్ గారు చెప్పిన OTP కథ చాలా ఇంట్రెస్ట్ తో క్యూరియాసిటీ గా చాలా డిఫరెంట్ గా అనిపించింది. మంచి స్క్రిప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర దర్శకుడు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. ఈ సినిమాను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసుకొని  శివరాత్రి కి మా సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ  భాషల్లో రిలీజ్  చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
 
నిర్మాత గురు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ థ్రిల్లర్  నేపద్యంలో సాగే ఈ సినిమాకు హీరోయిన్ నందిత శ్వేత గారు కీ రోల్ లో నటిస్తున్నారు.తనకు జోడీగా రామ్ మిట్టకంటి హీరోగా నటిస్తుండగా ఇంకా సూర్య తేజ్, డి. జె. టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ (విలన్ ) తదితరులతో పాటు మంచి టెక్నిషియకన్స్ దొరికారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను మూడు షెడ్యూల్ లో పూర్తి చేసుకొని మహా శివరాత్రికి మల్టీ లాంగ్వేజ్ లలో విడుదల చేస్తాము అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విక్ర‌మ్ కోబ్రా చిత్రాన్ని 20నిముషాలు కుదించారు