Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 13 March 2025
webdunia

నంది కోటయ్య రైటర్న్ అఫ్ ది డ్రాగన్ - శివ నాగేశ్వ‌ర‌రావు

Advertiesment
Kota Srinivasa Rao
, సోమవారం, 11 జులై 2022 (10:39 IST)
Kota Srinivasa Rao
న‌టుడు కోట శ్రీనివాసరావ్ గురించి తెలియందికాదు. ఆయ‌న మాడ్యులేష‌న్‌, హావ‌భావాలు, టైమింగ్ వెండితెర‌పై క‌నువిందు చేస్తాయి. ఎన్నో భిన్న‌మైన పాత్ర‌లు పోషించిన ఆయ‌న గ‌త కొంత‌కాలంగా వ‌య‌స్సురీత్యా వ‌చ్చిన అనారోగ్య‌కార‌ణంగా న‌ట‌న‌కు దూరంగా వున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న్ను ఆమ‌ధ్య అడిగితే ఊపిరి వున్నంత‌వ‌ర‌కు న‌టిస్తూనే వుంటాను. కానీ ఎవ‌రూ న‌న్ను పిల‌వ‌డంలేదు. అంతా కొత్త పిల్ల‌కాయ‌లు ద‌ర్శ‌కులుగా వ‌చ్చారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
 
ఇప్పుడు ఆయ‌న్ను మ‌రోసారి వెండితెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శివ నాగేశ్వ‌ర‌రావు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శివ నాగేశ్వ‌ర‌రావు ఇలా తెలియ‌జేస్తున్నారు. కంకిపాడు.. ఏ స్మాల్ విలేజ్...... మ్యారేజ్ లుకింగ్స్ ఆరెంజ్డ్.. I want to see the girls face..... కార్డ్స్ ప్రింటెడ్...... I am a man.. Heman.... రైటర్న్ అఫ్ ది డ్రాగన్...ఇది మీ అందరికీ గుర్తు వచ్చేవుంటుంది.. నా మనీ సినిమా లోది . కోట శ్రీనివాసరావ్ గారు.. నేను ముద్దగా పిలుచుకునే పేరు 'నంది కోటయ్య'  ... ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్.. మా 'దోచేవారెవరురా' లో నటిస్తున్నాడు... కెమెరా స్టార్ట్ చెయ్యగానే అతని లోనే నటుడు బయటకు వచ్చి విజ్రంబించాడు. జూలై10న ఆయ‌న జన్మదినం ఈ సంద‌ర్భంగా  శుభాకాంక్షలు నంది కోటయ్య గారూ అంటూ ఫొటో ఫోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏజెంట్ కోసం అక్కినేని అఖిల్ సిక్స్ ప్యాక్ - నాలుగు రోజుల్లో టీజ‌ర్