Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1000 మంది ఆర్టిస్టులుతో క్లైమాక్స్ షూటింగ్ పూర్తిచేసిన నందమూరి కళ్యాణ్ రామ్

Advertiesment
Klayna ram climax fight

డీవీ

, మంగళవారం, 30 జులై 2024 (17:35 IST)
Klayna ram climax fight
హీరో నందమూరి కళ్యాణ్ రామ్  #NKR21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రూషియల్ పార్ట్  హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్ భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఒక్క క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్‌లో  హయ్యస్ట్ ఖర్చు పెట్టిన  క్లైమాక్స్. ఇది గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో వుండబోతోంది.
 
అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న  బ్రహ్మ కడలి మ్యాసీవ్ సెట్ డిజైన్‌ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్  సన్నివేశాలు, స్టంట్లు బ్రెత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.
 
క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది. సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా వుండబోతోంది.
 
హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్  ప్రెజెన్స్ తో ఆకట్టుకోనున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.  
 
ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూసూద్ పుట్టిన రోజు.. కుప్పంలో రియల్ హీరోకి చిన్నారుల సెల్యూట్ (వీడియో)