Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాలెంటైన్ డే గురించి, న‌టుడికి ఏమి వుండ‌కూడ‌దో చెప్పిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna, Allu Sirish, Anu Emmanuel
, సోమవారం, 31 అక్టోబరు 2022 (11:10 IST)
Nandamuri Balakrishna, Allu Sirish, Anu Emmanuel
ఇక్కడకు వచ్చిన  దర్శకులు అందరూ  ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ వారిని వారే ఆవిష్కరించు కుంటూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని- నందమూరి బాలకృష్ణ అన్నారు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయిలే్ జంట‌గా న‌టించిన చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక‌కు నందమూరి బాలకృష్ణ  ముఖ్య అతిధిగా హాజరై ఈ చిత్ర బిగ్ టికెట్‌ను బాలకృష్ణ విడుదల చేశారు
 
webdunia
Nandamuri Balakrishna launch big ticet with presence of Allu Aravind
అనంత‌రం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, అల్లురామలింగయ్య  గారితో కొన్ని సినిమాలలో నటించే  అదృష్టం కూడా నాకు దక్కింది. యాక్టింగ్ పరంగా నన్ను మించిన వాడు లేడనే గర్వం ఉండకూడదు. ఆలా లేనందుకే వారు  ఎన్నో సినిమాలు చేశారు.అల్లు అరవింద్ గారు  గీతా ఆర్ట్స్ ను స్థాపించి పెద్ద  స్థాయికి తీసుకు వచ్చాడు. దీనికోసం తను చాలా కష్టపడ్డాడు. అయన  అసోసియేషన్ లో నేను చేసిన ఆన్ స్టాపబుల్ మంచి సక్సెస్ అయ్యింది. అది ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో కూడా వివరించడం జరిగింది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక  స్త్రీ ఉంటుంది అంటారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్న కూల్చాలాన్నా ఆ కుటుంబ బరువు బాధ్యతలు  వారి చేతుల్లోనే ఉంటుంది. 
 
అయితే ప్రస్తుతం యూత్ అభిరుచులు  మారుతున్నాయి.. సహజీవనం, ఎఫైర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేలా దర్శక, నిర్మాతలు కృషి చెయ్యాలి. ఈ సినిమాకు అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనూప్ పాడిన పాట బాగుంది. అల్లు శిరీష్, అను లు సినిమాకు తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు. దర్శకుడు  తీసిన విధానం  బాగుంది హీరో హీరోయిన్ లా నుండి అద్భుతమైన నటనను  రాబాట్టుకున్నాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రైలర్ చూస్తుంటే న కొత్తగా అందంగా  కలర్ ఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తుంది. అందుకే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అయితే దాన్ని నవంబర్ 4 కు మార్చాల్సి వస్తుందేమో అనిపించింది (నవ్వుతూ)..నాకు  ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే  నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది, వాళ్లపై  బలవంతంగా రుద్దాలనుకోను.నవంబర్ 4 న విడుదల అవుతున్న సినిమా చిత్ర యూనిట్ అందరికీ  పెద్ద విజయం  సాదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ, దర్శకుడు రాకేష్ చేసిన విజేత సినిమా ఆడక పోయినా మేము నమ్మి భరద్వాజ గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చాము . అయితే తను మా నమ్మకాన్ని నిలబెడుతూ బాగా తీశాడు. భరద్వాజ గారు ఈ సినిమా చూసి బాగుందని చెప్పడంతో  హ్యాపీ ఫీలయ్యాము. జూబ్లీహిల్స్ కుర్రాన్ని మిడిల్ క్లాస్ కుర్రాడు గా  ఈ సినిమాలో చూయించాము.తను  కూడా ఛాలెంజ్ గా తీసుకుని నటించాడు. ప్రస్తుతం యూత్ పేస్ చేస్తున్న ప్రాబ్లెమ్స్ ను ఈ సినిమాలో చూయించడం జరిగింది. యూత్ అందరికీ  కచ్చితంగా నచ్చుతుంది. అలాగే బన్నీ వాసు ఈ సినిమా ముందుకు రాకుండా వెనుక ఉండి వర్క్ చేస్తున్నాడు. నవంబర్ 4 న  వస్తున్న ఈ సినిను అందరూ ఆదరించాలని  కోరుతున్నాను అన్నారు.
 
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మా నాన్న, అల్లు అరవింద్ ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ వారితో పాటు మేము కంటిన్యూ అవుతున్నాందుకు హ్యాపీ గా ఉంది. బాలకృష్ణ గారు ఈ ఫంక్షన్ కు రావడం చాలా సంతోషంగా  ఉంది. ఈ సినిమా కొరకు చాలామంది డైరెక్టర్స్ ను  అనుకున్నాము. చివరకు విజేత' సినిమా దర్శకుడు రాకేష్ శశి కి అవకాశం ఇచ్చాము. తను  ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. నేను ఈ సినిమా చూశాను చాలా బాగుంది .హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్, సునీల్ కామెడికు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. నవంబర్ 4 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని అన్నారు.
 
చిత్ర దర్శకుడు రాకేష్ శశి  మాట్లాడుతూ,  సమర సింహా రెడ్డి సినిమా చూసిన తరువాత ఇదిరా సినిమా అనిపించింది. ఆసినిమా ద్వారానే నాకు సినిమాలలోకి రావాలనిపించింది.గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే అందరి డ్రీమ్. అలాంటిది నాకీ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ సినిమాలో రీల్ లైఫ్ క్యారెక్టర్ కు రియల్ లైఫ్ క్యారెక్టర్ కు చాలా తేడా ఉంటుంది. అల్లు సిరీస్, అను ఇమ్మాన్యూల్ లు ఈ సినిమా కొరకు చాలా కష్టపడి చేశారు. మా  కాంబినేషన్  లో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
 
చిత్ర హీరో అల్లు శిరీస్ మాట్లాడుతూ, చిన్నప్పుడు బాలయ్య గారి సినిమాలు చూసేవాన్ని. ఇప్పుడు కూడా  మా జోష్ తగ్గినా.. బాలకృష్ణ గారి జోష్ తగ్గలేదు. సినిమా సినిమాకు తను నిత్య యవ్వనుడిలా ఉంటాడు. తను ఇలాగే ఉంటూ ఎన్నో సినిమాలు చెయ్యాలి.మా నాన్న తో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు రెండు సినిమాలు చేశాను అవి రెండు హిట్ అయ్యాయి. ముచ్చటగా  మూడో సారి చేస్తున్న ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.మా దర్శకుడు రాకేష్  పని రాక్షసుడు అని చెప్పవచ్చు.ఈ సినిమా బాగా రావడానికి చాలా కష్టపడ్డాడు .అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనూప్ తో చేయాలను కున్నాము. కానీ తను వచ్చి నాకొక మంచి పాట ఇచ్చారు. ఈ స్క్రిప్ట్ ను అందించిన తమ్మారెడ్డి గారికి ధన్యవాదములు తెలిపారు.
 
చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..గత 2 సంవత్సరాల నుండి ఈ సినిమా కొరకు ట్రావెల్ అవుతున్నాను. శిరీష్ చాలా మంచి లవ్లీ కో స్టార్. దర్శకుడు బాగా తీశాడు. అచ్చు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నవంబర్ 4 న వస్తున్న మా రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఉర్వశివో రాక్షసివో” సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ఇంకా దర్శకులు మారుతి, చందు మొండేటి, వశిష్ట, వెంకటేష్ మహా, పరుశరామ్, సంగీత దర్శకుడు అచ్చు రాజమణి, లిరిక్ రైటర్ పూర్ణచారి,  నటుడు సునీల్ మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగర్ సునీత లేటెస్ట్ వీడియో వైరల్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. (video)