Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఖర్చు రూ.55 కోట్లు.. వసూళ్లపై నోరు మెదపని నిర్మాతలు

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం మంచి సక్సెస్‌తో కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మ

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఖర్చు రూ.55 కోట్లు.. వసూళ్లపై నోరు మెదపని నిర్మాతలు
, సోమవారం, 16 జనవరి 2017 (07:13 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం మంచి సక్సెస్‌తో కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మించారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు వీరుడి చరిత్రను ఈ సినిమా ద్వారా అందరికి తెలియజేయాలనే మా లక్ష్యం నెరవేరింది. టైటిల్‌లో ఏ పవర్ ఉందో తెలియదు కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కేవలం 79 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేశాం. సినిమా కోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు శ్రమించారు. క్రిష్ నమ్మకం, ధైర్యమే మా అందర్ని ముందుకు నడిపించింది. సినిమా కోసం బాలకృష్ణ అందించిన సహకారం మరువలేనిది. 
 
చిత్రీకరణ సమయంలో ప్రతిరోజు 12 గంటల పాటు గుర్రంపై కూర్చుంటూ సన్నివేశాల్ని పూర్తిచేశారు. మా గత సినిమాలతో పోలిస్తే నాలుగైదు రేట్లు ఎక్కువ బడ్జెట్‌తో చేసిన సినిమా ఇది. రూ.55 కోట్లు వ్యయం చేశాం. బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమా కావడంతో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేయాలనే భయం ప్రతి క్షణం మా మనసులో ఉండేది. అదే సినిమా బాగా రావడానికి ఉపయోగపడిందని చెప్పారు. అయితే, ఇప్పటివరకు వసూలైన కలెక్షన్ల వివరాలను వెల్లడించేందుకు వారు ఆసక్తిచూపక పోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షించే ఓ అన్నయ్య త్యాగం.. పవన్ "కాటమరాయుడు" కథ ఇదే...