Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఒకే టిక్కెట్‌పై 99 చిత్రాలు...

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు.

Advertiesment
Nandamuri Balakrishna
, మంగళవారం, 4 అక్టోబరు 2016 (17:43 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం 900 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్లో రేపటి నుంచి (అక్టోబర్ 5) జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 
 
మ‌రే హీరో సినిమాల‌కు లేనివిధంగా బాల‌కృష్ణ అభిమానులు 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రానికి ఇలా స్వాగ‌తం ప‌లక‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం కావడం గమనార్హం. ఈ అరుదైన విషయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటుసంపాదించుకోనుంది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ న‌టించిన 100 సినిమా కోసం ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకైనా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సమంత సొంత కష్టంతో పైకొచ్చింది.. పెళ్ళికి తర్వాత సినిమాలు ఆపేయదు..