Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ అయిన నరసింహ నంది చిత్రం "జాతీయ రహదారి"

ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ అయిన నరసింహ నంది చిత్రం
, శుక్రవారం, 29 జనవరి 2021 (17:33 IST)
Narasimha nandi, Jaatiya Rahadari
భీమవరం టాకీస్ పతాకంపై మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి,శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణనిర్మిస్తున్న”జాతీయ రహదారి” చిత్రం ఫిల్మ్ఫేర్ అవార్డ్కు నామినేట్ అయిన సందర్బంగా  ప్రముఖ నిర్మాత నిర్మాత అంబికా కృష్ణ చిత్రం గురించి స్పందిస్తూ దర్శక, నిర్మాతకు అభినందనలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, భీమవరం టాకీస్లో రామ సత్యనారాయణ నిర్మిస్తున్న 101వ చిత్రం జాతీయ రహదారి. రామసత్య నారాయణ గారు చిన్న ప్రొడ్యూసరా లేక పెద్ద ప్రొడ్యూసర్ అనేది మనకు అర్థం కావడం లేదు, ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చేయలేనన్నీ 100 సినిమాలు తీసి 101వ సినిమాతో జాతీయ రహదారి చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా ఆనందదాయకం. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీసే నిర్మాతలు సైతం ప్రస్తుతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అటువంటిది రామ సత్య నారాయణ గారు ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని 101 వ సినిమా "జాతీయ రహదారి" తో మన ముందుకు రావడంతో  అభినందించాల్సిన విషయం.

అయితే ఈ జాతీయ రహదారి సినిమాకు నరసింహ నంది లాంటి డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం.నరసింహ నంది తీసిన మూడు సినిమాలు '1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం', 'లజ్జ' సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాంటి డైరెక్టర్ను ఎన్నుకొని ఈ జాతీయ రహదారి చేస్తున్నాడు. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా అప్పుడే ఫిలింఫేర్ అవార్డ్కు సెలెక్ట్ అవడం జరిగింది. అయితే సినిమాలో  కథతోపాటు క్వాలిటీ ఉంటే కానీ ఫిలింఫేర్ అవార్డ్లకు సెలెక్ట్ కావు.

అలాంటిది ఈ సినిమా ఫిలిం ఫేర్ వార్డుకు వెళ్లిందంటే సగం నంది వచ్చినట్లే. డైరెక్టర్గారి గొప్పతనంతో, నిర్మాత మంచితనంతో ఈ మూవీకి ఎన్నో అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.తెలుగు చిత్రసీమలో ఈరోజు వరకు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే తమిళంలో సూర్య నటించిన ఆకాశమే హద్దు రా, మలయాళంలో తీసిన జల్లికట్టు సినిమాలు ఆస్కార్ అవార్డులకు వెళుతున్నట్టు తెలిసింది. అయితే ఆ సినిమాలు వెళ్లినట్లు మన తెలుగు సినిమా ఆ స్థాయికు ఎందుకు వెళ్లడం లేదో నాకు అర్థం కావడం లేదు. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు,ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఆ దిశగా అడుగులు వేసేలా శ్రమ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహ నంది దర్శకత్వంలో రామ సత్యనారాయణ గారు తీస్తున్న 101వ "జాతీయ రహదారి" సినిమా అద్భుతమైన అవార్డులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.
 
సాంకేతిక నిపుణులు 
రైటర్, డైరెక్టర్… నరసింహ నంది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సంధ్య స్టూడియస్
సంగీతం… సుక్కు
పాటలు..మౌనశ్రీ
కెమెరా..మురళి మోహన్ రెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ధ‌ర్మ‌స్థ‌లి