Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ బలమైంది... అఖిల్-శ్రియల ఆ క్షణాల కోసం నాగ్ గంపెడాశలు...

ఇపుడు టాలీవుడ్ బిగ్గెస్ట్ న్యూస్.. అఖిల్ పెళ్లి ఆగిపోయింద‌న్న వార్తే. అయితే దీనిపై వార్త‌లు గుప్పుమ‌న్నప్ప‌టికీ.. అక్కినేని, జీవీకే కుటుంబాల నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. అయితే ఈ రెండు కుటుంబాలు నోరు విప్ప‌క‌పోవ‌డంతో ఈ వార్త వాస్త‌వ‌మేన‌న్న వాద‌న వినిప

Advertiesment
ప్రేమ బలమైంది... అఖిల్-శ్రియల ఆ క్షణాల కోసం నాగ్ గంపెడాశలు...
, బుధవారం, 1 మార్చి 2017 (18:02 IST)
ఇపుడు టాలీవుడ్ బిగ్గెస్ట్ న్యూస్.. అఖిల్ పెళ్లి ఆగిపోయింద‌న్న వార్తే. అయితే దీనిపై వార్త‌లు గుప్పుమ‌న్నప్ప‌టికీ.. అక్కినేని, జీవీకే కుటుంబాల నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. అయితే ఈ రెండు కుటుంబాలు నోరు విప్ప‌క‌పోవ‌డంతో ఈ వార్త వాస్త‌వ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే దీనిపై మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికొచ్చింది. వాళ్లు విడిపోయార‌ని అందరూ అనుకుంటున్నా.. ప్రేమ చాలా బలమైంది... వాళ్లు తిరిగి క‌లుస్తారంటూ నాగ్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడ‌ట‌.
 
నాగార్జున నమ్మకం 100 శాతం కరెక్టే. ఎందుకంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక్కసారి ప్రేమ పుట్టిందంటే అది జీవితాంతం అలా జీవించే వుంటుంది. కాబట్టి ఏ క్షణమైనా ఎవరికివారు పశ్చాత్తాపంతో కలిసే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ విష‌యంపై ఎవ్వ‌రూ నోరు మెద‌పొద్ద‌ని నాగార్జున సూచిస్తున్నార‌ట‌. మాములుగా నాగార్జునకు తన సినిమాలకు సంబంధించి గానీ.. వ్యక్తిగత విషయాలకు సంబంధించి గానీ ఏవైనా విషయాలు బయటకు వస్తే వెంటనే క్లారిటీ ఇవ్వడం మొదటి నుంచీ ఉన్న అలవాటు. సమంతా, చైతుల ప్రేమ వ్యవహారాన్ని కూడా దాచి పెట్టకుండా.. మంచి సంధర్భం చూసి పబ్లిక్‌గా చెప్పేశారు.
 
కానీ అఖిల్, శ్రేయా భూపాల్ పెళ్లి వ్యవహారం గురించి మాత్రం ఆయన నోరు మెదపడంలేదు. ఈ విషయంపై ఏమీ మాట్లాడొద్దని కుటుంబ సభ్యులకు కూడా సూచించారట. దీనికి కారణం చివరి క్షణాల్లోనైనా.. ఈ పెళ్లి ఓకే అవుతుందని నాగ్ బలంగా నమ్మడమేనట. అఖిల్ పెళ్లికి బ్రేక్ పడిందనే న్యూస్ తెలిసినప్పటి నుంచీ రకరకాల కథనాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కానీ ఈ విషయమై అటు నాగ్ ఫ్యామిలీ గానీ.. జీవీకే ఫ్యామిలీ గానీ క్లారిటీ ఇవ్వలేదు. 
 
ఎప్పటికైనా అఖిల్, శ్రియ తమ మధ్య మనస్పర్థలను తొలగించుకొని మళ్లీ కలిసిపోతారని నాగార్జున నమ్ముతున్నారట. వారిద్దరూ కలిసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారట. పాపం నాగ్ ఇద్ద‌రు కొడుకుల పెళ్లి చేసి హాయిగా ఉందామ‌నుకుంటే పెద్దోడి పెళ్లి కంటే ముందు చిన్నోడే ఇలా షాకిచ్చాడు. దీంతో ఇలా అంద‌రిలో త‌లెత్తుకోలేక‌పోయే ప‌రిస్థితికి వ‌చ్చాడు. అఖిల్-శ్రేయా భూపాల్ పెళ్లి జరుగుతుందని విశ్వసిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఇండియా ఆన్ ఫిల్మ్'లో చిత్రాల ప్రదర్శన.. బాహుబలి-2ను వీక్షించనున్న మోడీ - బ్రిటీష్ రాణి