Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ది ఘోస్ట్ నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్

The Ghost new look
, సోమవారం, 29 ఆగస్టు 2022 (15:29 IST)
The Ghost new look
అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్' తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 200K పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.
 
ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది.
 
ఈ చిత్రంలో తమహగనే అనేది నాగార్జున ఆయుధం. తమహగనే గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్  వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. నాగార్జున, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్ , అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ,  భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా,  బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
 
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్విని దత్‌కు ఎన్టీఆర్ శతాబ్ది చలన‌చిత్ర అవార్డు