Samantha on Nagachaitanya Wedding
Samantha Fan cried on Nagachaitanya Wedding: అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తన్న తమ హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అటు సమంత మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అయితే ఇప్పటి వరకూ చైతూ డేటింగ్, పెళ్లిపై ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
వీళ్ల పెళ్లి తర్వాత కూడా తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఈ మధ్యే తాను నటించిన సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఫైట్ చేస్తే ఓ అమ్మాయిలాగా చేయాలంటూ మరో చిన్న వీడియోను కూడా స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసింది. పెద్దగా శోభిత పెళ్లి గురించి సమంత ఎక్కడా బయటపడలేదు. అయితే శోభిత-చైతూ పెళ్లి జరిగిందని ఓ యువతి కన్నీళ్లు పెట్టుకుంది.
సమంత వీరి పెళ్లి చూసి ఎంత బాధపడివుంటుందోనని ఏడ్చేసింది. సమంత గుండె చైతూ పెళ్లి చూసి బరువై వుండిపోయివుంటుందని కంటతడి పెట్టింది. "పాపం సమంత ఎంత బాధపడి వుంటుందో.. ఎంత పెయిన్‌లో వుండి వుంటుందో.. అందుకే ఎవ్వరినీ ఎక్కువగా లవ్ చేయకూడదు." అంటూ ఆ వీడియోలోని యువతి బాధపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమంత కూడా ఇలా బాధపడి వుండదంటూ నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.