టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తాను నటించిన 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలు హిట్ కొట్టడంతో ఫుల్ జోష్‌మీద ఉన్నాడు. ప్రస్తుతం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. నాగచైతన్య తొలి తమిళ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా ఈ సినిమాకు పేరు ఖరారు కాలేదు.
ఈ సినిమా గురించి వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. నాగ చైతన్యకున్న ఫ్యాన్స్ గురించి బాగా తెలుసు. అందుకే ఓ విజయ వంత మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాను. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటులు మాత్రమే కాకుండా, ప్రముఖ సాంకేతిక నిపుణులను కూడా సంతకం చేశారు" అని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
ప్రొడ్యూసర్ : శ్రీనివాసా చిట్టూరి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్
సమర్పణ: పవన్ కుమార్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్టా.