Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

సమంతపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది.. అది ఎప్పటికీ పోదు: చైతూ

Advertiesment
NagaChaitanya-Samantha
, శనివారం, 6 ఆగస్టు 2022 (10:53 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడిపోయిన పది నెలల గడుస్తున్న చై-సామ్‌ విడాకులు వార్తలు నెట్టింట చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
 
విడాకుల ప్రకటన వరకు కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించారు. అలాంటి చై-సామ్‌ విడిపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదట్లో విడాకులపై అసలు నోరు విప్పని చై లాల్‌ సింగ్‌ చద్దా ప్రమోషన్స్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. 
 
విడాకుల గురించి కాకుండా కొత్తగా సమంతపై తన అభిప్రాయం ఏంటని అడిగింది యాంకర్‌. దీనికి చై స్పందిస్తూ.. " సమంత అంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేం విడాకులు ప్రకటన ఇచ్చాం. 
 
ఆ సమయంలో కూడా మాకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్‌ ఉంది. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రారంభంలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను" అని చెప్పుకొచ్చాడు.
 
ఆ తర్వాత మరి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని నిర్వచించడం నేర్చుకున్నారా? అని అడగ్గా... అదే చేస్తున్నాను కాబట్టే ప్రస్తుతం ఇలా ఉన్నానన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైగర్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. అఫత్ అంటూ..? (video)