Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చివరి షెడ్యూల్ లో నాగ చైతన్య కస్టడీ చిత్రం

Advertiesment
kastadi, chaitu
, శుక్రవారం, 6 జనవరి 2023 (16:16 IST)
kastadi, chaitu
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే  సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టీమ్ ఈరోజు చివరి షెడ్యూల్ షూట్‌ని ప్రారంభించింది. దీనితో మొత్తం ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ప్రధాన నటీనటులందరూ పాల్గొంటున్న ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో  కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించిన కస్టడీ గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఈ టీజర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది.
 
ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అద్భుతమైన సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలుపులతో కూడిన ప్రత్యర్థి ఎలా ఉందంటే, రివ్యూ