Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాడో కుసంస్కారి.. మరొకడు ట్వీట్టర్‌లో వాగుతుంటాడు : యండమూరి - వర్మలపై నాగబాబు ఫైర్

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు నిప్పులు చెరిగారు. అదీకూడా ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్, ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మలపై మాటలతూటాలతో విరుచుకుపడ్డారు. హీరో రాంచరణ్‌లో టాలెంట్

వాడో కుసంస్కారి.. మరొకడు ట్వీట్టర్‌లో వాగుతుంటాడు : యండమూరి - వర్మలపై నాగబాబు ఫైర్
, శనివారం, 7 జనవరి 2017 (20:20 IST)
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు నిప్పులు చెరిగారు. అదీకూడా ప్రముఖ నవలా రచయిత యండమూరి రవీంద్రనాథ్, ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మలపై మాటలతూటాలతో విరుచుకుపడ్డారు. హీరో రాంచరణ్‌లో టాలెంట్ లేకపోతే... ఎన్ని సర్జరీలు చేసినా ఫలితం లేదంటూ గతంలో యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై పెను దుమారమే లేచింది. 
 
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 150 చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. శనివారం గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ వేదికగా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. అప్పట్లో మౌనంగా మెగా ఫ్యామిలీ... ఈ వేదికగా నాగబాబు ఆయనపై విరుచుకుపడ్డారు. వాడో కుసంస్కారి అన్నారు. వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతాడు, వాడికి వ్యక్తిత్వం లేదని మండిపడ్డారు. అలాంటి వాడు మైలేజ్ కోసం చేసే వ్యాఖ్యలు తమకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చవని అన్నారు. 
 
అలాగే ముంబైలో కూర్చుని ట్విట్టర్‌లో మరొకడు వాగుతుంటాడు. వాడికి సినిమాలు తీయడం చేతకావడంలేదని, ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడని అన్నారు. వాడు మర్యాదగా ఉంటే బాగుటుందని ఈ వేదిక సాక్షిగా చెబుతున్నానని ఆయన హెచ్చరించారు. తమ ఫ్యామిలీని ఏదో అనడం ద్వారా మైలేజీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 
 
ఇకపోతే... 'చిరంజీవి మళ్లీ నటిస్తున్నాడు అనగానే రిమేక్‌ చేయడం ఏమిటి అని అందరూ ప్రశ్నించారు. అసలు రిమేక్‌ చేస్తే తప్పేంటి' అని ప్రశ్నించారు. 'అన్నయ్య ఈజ్‌ బ్యాక్‌. రాజకీయాల తర్వాత ఓ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. థ్యాంక్స్‌ అన్నయ్యా!. ఇప్పటివరకు ప్రొడక్షన్‌లో ఉండగా సినిమాకు సంబంధించిన సీనో, ఫైటో, సాంగో చూడటం ఆనవాయితీ. కానీ ఈ చిత్ర ప్రివ్యూ కూడా చూడలేదు. 'ఇంద్ర' తర్వాత ఈ సినిమా నేరుగా థియేటర్లో చూస్తాను.
 
అందరూ రీమేక్‌ చేయడం ఏమిటి అంటున్నారు. రిమేక్‌ చేయడం తప్పేంటి. అమితాబ్‌, రజినీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రామ్‌చరణ్‌ ఇలా చాలామంది చేశారు. చాలామందికి మెగా ఫ్యామిలీపైనే చూపు ఉంటుంది. ఎవరినో ఒకరిని విమర్శించాలని చూస్తుంటారు. అలాంటివి మేము పట్టించుకోం' అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''ఖైదీ నెంబర్ 150'' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభం... మెగా ఫ్యాన్స్‌ పండగ.. నీరు నీరు పాట రిలీజ్