Kusalav, Tanmayi, Venkat Bulemoni, Priyanka Manyal, Ramki and others
కుశలవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ బులెమోని రూపొందిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ మయూఖం. శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ కార్యక్రమంలో యాక్టర్ రాంకీ, బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ హరి గోవింద్, రెడ్ ఎఫ్ఎం నుంచి మాజీ మార్కెటింగ్ మేనేజర్ బద్రినాథ్, ఫోర్స్ మోటార్స్ సంస్థ నుంచి శివకుమార్, మామ్ కంపెనీ సీఈవో రాహుల్, హీరో, నిర్మాత రాంకీ, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ - మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసింది. అందులో ప్రస్తుతం రాజా సాబ్ మూవీ ఉంది. మనమే, అహింస, ఆడవాళ్లు మీకు జోహార్లు..ఇలా దాదాపు 140 చిత్రాలకు మేము ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాం.
ఇప్పుడు సంస్థ నుంచి మయూఖం అనే భారీ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాం. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో తాల్ అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రోమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అన్నారు.
డీవోపీ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ, కథ వినగానే సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను. ఆయన కథను చెప్పిన విధానం, చేసిన ప్రెజెంటేషన్ చూశాక ఇదొక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సినిమా కోసం ప్యాషనేట్ గా కష్టపడే వెంకట్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేయడం కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా అన్నారు.
హీరో కుశ్ లవ్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ గారు ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ ఫార్మెన్స్ నచ్చుతుంది, మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు.
హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ, నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. మీ అందరినీ థియేటర్స్ లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నా. మీరంతా సపోర్ట్ చేయండి. అన్నారు.
అతిథిగా వచ్చిన లేడీ డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ - "మయూఖం" అనే టైటిల్ చాలా బాగుంది. పోస్టర్ తోనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఈ సినిమా వెంకట్ గారికి ఆయన టీమ్ అందరికీ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. హీరో కుశ లవ్ ప్రతిభ కలవాడు. ఈ సినిమాతో అతనికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో, ప్రొడ్యూసర్ రాంకీ మాట్లాడుతూ, డైరెక్టర్ వెంకట్ చాలా టాలెంటెడ్. ఆయన మయూఖం చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. మీలో ఎవరైనా స్టార్ కావొచ్చు. స్టార్ అయ్యాక డైరెక్టర్ వెంకట్ చేసిన హెల్ప్ మర్చిపోవద్దు. "మయూఖం" సినిమా పోస్టర్ చూస్తుంటే హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలి. అన్నారు.
ఇంకా నటులు నటరాజ్, సునీత మనోహర్, ప్రశాంత్, తుషార్, అమర్ జిత్, దేవిల్, అయాన్ మాట్లాడుతూ, చిత్ర కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద స్కేల్ మూవీ అవుతుందని నమ్మకం కలిగింది. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.