Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ సీనంటే భలే ఇష్టం.. తప్పతాగి నటించడం కోసం?: మంజిమా మోహన్

ప్రేమమ్ హీరోయిన్ మంజిమా మోహన్ అందాల ఆరబోతకు నో చెప్తోంది. తెలుగులో సాహం శ్వాసగా సాగిపోలో చైతూతో చేసిన మంజిమాకు మలయాళంలో ఫాలోయింగ్ ఎక్కువ. బాలనటిగా అక్కడ చాలా సినిమాలు చేసిన మంజిమా మోహన్.. దక్షిణాది సి

Advertiesment
Manjima Mohan
, మంగళవారం, 19 డిశెంబరు 2017 (12:39 IST)
ప్రేమమ్ హీరోయిన్ మంజిమా మోహన్ అందాల ఆరబోతకు నో చెప్తోంది. తెలుగులో సాహం శ్వాసగా సాగిపోలో చైతూతో చేసిన మంజిమాకు మలయాళంలో ఫాలోయింగ్ ఎక్కువ. బాలనటిగా అక్కడ చాలా సినిమాలు చేసిన మంజిమా మోహన్.. దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కన్నేసింది. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
అయితే పాత్రకు తగినట్టే త న వస్త్రధారణ వుంటుందని క్లారిటీ ఇచ్చింది. కథానాయికలు అందంగా కనిపించాలి. కానీ హద్దులు దాటనంతవరకు నటిస్తే సరిపోతుందని మంజిమా చెప్పింది. ఎక్స్‌పోజింగ్‌కి గ్లామర్ అనే పేరు తగిలించేందుకు తాను సిద్ధంగా లేనని వెల్లడించింది. దీంతో అవకాశాలు తగ్గినా పర్లేదని.. తనకు తగిన పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తాయని వెల్లడించింది.
 
ఓ ఇంటర్వ్యూలో మంజిమా మోహన్ మాట్లాడుతూ.. హిందీ బ్లాక్‌బస్టర్ క్వీన్ మలయాళం రీమేక్ జామ్ జామ్‌లో తాను తప్పతాగి యాక్ట్ చేసే సన్నివేశం తనకెంతో నచ్చుతుందని చెప్పింది. హిందీలో కంగనా రనౌత్ నటించగా.. త్వరలో విడుదల కానున్న జామ్ జామ్‌లో (క్వీన్ రీమేక్)లో మద్యం తాగి తాను చేసే సన్నివేశం కోసం చాలా కష్టపడ్డానని చెప్పింది. 
 
కోలీవుడ్ నటుడు శింబు గురించి మాట్లాడుతూ.. అతనితో తనకెలాంటి వివాదం లేదని తెలిపింది. సెట్స్‌లో పక్కాగా వుంటాడని.. షూటింగ్‌కు శింబుగా లేటుగా వస్తాడని తాను చెప్పినట్లు వివాదం ముదిరింది. శింబు లేటుగా వచ్చినా మూడు గంటల పనిని గంటలోనే ముగించేస్తాడని వెల్లడించింది. అతనిని చూసి సమయాన్ని వృధా చేయకూడదనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయనకు 52 ఏళ్లు.. ఆమెకు 26ఏళ్లు.. 2018లో పెళ్లి..