Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా చెమటకంపును నేను భరించలేకపోతున్నా, విషం ఇస్తే తాగి చనిపోతా: కోర్టు ముందు కన్నడ హీరో దర్శన్

Advertiesment
Pavithra gowda-Darshan

ఐవీఆర్

, బుధవారం, 10 సెప్టెంబరు 2025 (14:06 IST)
తను రిలేషన్‌లో వున్న నటి పవిత్ర గౌడ్‌కు అసభ్య సందేశాలు పంపించాడన్న ఆగ్రహంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టు శిక్షణ అనుభవిస్తున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ఈ క్రమంలో మంగళవారం నాడు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందు హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ... చెమటకంపుతో నా దుస్తులు దుర్వాసన కొడుతున్నాయి. ఈ వాసనను భరించలేకపోతున్నాను. కాస్త విషం ఇస్తే తాగి చనిపోతాను. సూర్య కాంతి చూసి రోజులు గడిచిపోయాయి. నా చేతుల్లో ఫంగస్ వచ్చింది. జైలులో తను తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాంటూ కోర్టు ముందు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. కాగా దర్శన్ విన్నపం అనంతరం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్టు. 
 
హీరో దర్శన్ తో రిలేషన్ షిప్ వున్న నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడనే కారణంగా చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా హింసించి హత్య చేసారు. ఈ కేసులో నటుడు దర్శన్ తో పాటు నటి పవిత్రా గౌడ మరికొందరిని నిందితులుగా తేల్చారు పోలీసులు. వీరందరికీ కోర్టు జైలు శిక్ష విధించి కేసును దర్యాప్తు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Naga vamsi: వాయుపుత్ర: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం : చందూ మొండేటి