Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగీత దర్శకుడు రాజ్‌ హఠాన్మరణం

Advertiesment
Music Director Raj
, ఆదివారం, 21 మే 2023 (18:04 IST)
Music Director Raj
ప్రముఖ సంగీతద్వయం రాజ్‌`కోటి గురించి సినీప్రపంచానికి తెలిసిందే. చాలాకాలం క్రితం రాజ్‌, కోటిగా విడిపోయి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆదివారంనాడు కొద్దిసేపటిక్రితమే కూకట్‌పల్లిలోని ఫోరంమాల్‌ సమీపంలోని ఆయన స్వగృహంలో రాజ్‌ మృతిచెందారు. బాత్‌రూమ్‌లో కాలుజారిపడడంతో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఛాతిలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
 
సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు రాజ్: ఇతని పూర్తి పేరు తోటకూర సోమరాజు కోటితో కలిసి రాజ్  ప్రళయ గర్జన  పనిచేసిన మొదటి చిత్రం
 
ఆయనకు 68 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. దీప్తి, దివ్య, శ్వేత కుమార్తెల పేర్లు. దివ్య తెలుగు పరిశ్రమలో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. మలేషియాలో శ్వేత వుంటుంది. రేపు ఆమె రానుంది. రేపు మధ్యాహ్నం మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
రాజ్‌ మృతి పట్ల సంగీత దర్శకుడు కోటి తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. తాము స్వంత అన్నదమ్ముల్లా వుండేవాళ్ళమనీ, తన మాటకు ఎప్పుడూ గౌరవం ఇచ్చేవారని పేర్కొన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
 
ఇక. మ్యూజీషియన్‌ అసోసియేషన్‌ రాజ్‌ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన లేనిలోటు తీర్చలేదని పేర్కొంది. పలువురు సినీ ప్రముఖులు రాజ్‌ మృతిపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నీరు పెట్టిస్తున్న 'జబర్దస్త్' యాంకర్ సౌమ్యారావు వీడియో