Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

Pushpa 2 The rule

ఠాగూర్

, సోమవారం, 2 డిశెంబరు 2024 (11:41 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప-2: ది రూల్". ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 
 
సాధారణంగా బెనిఫిట్ షోలకు థియేటర్ వద్ద అమ్ముడయ్యే టికెట్ ధరతో పోలిస్తే, రెండు మూడు రెట్లు ఎక్కువగా తీసుకుంటారు. ఫ్యాన్స్ షోలకూ టికెట్ ధర కొన్ని సార్లు రూ.2 వేల వరకూ ఉంటుంది. అయితే 'పుష్ప-2' మూవీ టికెట్ ధరలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఓ థియేటర్లో ఏకంగా రూ.3 వేలకు టికెట్‌ను విక్రయిస్తున్నారు. ముంబైలోని ఓ థియేటర్లో 'పుష్ప-2' టికెట్ ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
 
ముంబై జియో వరల్డ్ డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్ మైసన్‌లో టికెట్ ధర రూ.3 వేలు చూపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ థియేటర్‌లో టికెట్ ధర అంత పెట్టడానికి కారణం ఏమిటంటే.. జియో వరల్డ్ డ్రైవ్‌ని సినిమాస్ పూర్తి లగ్జరీ వాతావరణంలో ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా స్క్రీన్‌ను బట్టి ఓపస్ గ్రైడ్ రెక్లయినింగ్ సీట్లను అమర్చారు. రూ.3 వేల టికెట్ ధర ఉన్న స్క్రీన్‌లో మాత్రం వెరోనా జీరో వాల్ సీట్లు అమర్చారు.
 
అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రేక్షకుల కోరిక మేరకు ఒక బటన్ నొక్కితే కోరిన పుడు సర్వ్ చేస్తారు. తినుబండారాలు కిందపడకుండా ఉండేందుకు సీట్లకు అనువైన లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. తమకు కావాల్సిన మేరకు సీట్లను జరుపుకునే అవకాశం ఉంటుంది. రెండు సీట్ల మధ్య అతి తక్కువ కాంతి ఉండే లైట్లు కూడా అమర్చి ఉంటాయి. సీట్లకు అమర్చిన సెన్సార్ల కారణంగా ప్రేక్షకుడు అందులో నుంచి లేచిన వెంటనే అవి యథాస్థితికి వచ్చేస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ