'అమ్మ'కు నివాళులు తెలిపిన ముకేశ్ అంబానీ, నాగార్జున, మోహన్ బాబు, బాలకృష్ణ
అమ్మ మాట చెబితే నాన్న ఎంతో గౌరవంతో మాట్లాడేవారు... అక్కినేని నాగార్జున. నాకిప్పటికీ గుర్తు. జయలలిత గురించి చెప్పేటపుడు మా నాన్నగారు ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున
అమ్మ మాట చెబితే నాన్న ఎంతో గౌరవంతో మాట్లాడేవారు... అక్కినేని నాగార్జున.
నాకిప్పటికీ గుర్తు. జయలలిత గురించి చెప్పేటపుడు మా నాన్నగారు ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
మహిళా శక్తికి నిదర్శనం - డా.మోహన్ బాబు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారి ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జనాకర్ష నేత, అంత కంటే గొప్ప మనసున్న వ్యక్తి, మహిళా శక్తికి నిద్శనం జయలలితగారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు కలిసి మాట్లాడాను. కలిసిన ప్రతిసారి గొప్ప అదృష్టంగా భావించాను. గొప్ప నటి, రాజకీయ నాయకురాలు. జయలలితగారి మరణం తమిళ సోదరీ సోదరీమణులకు తీరనిలోటు. ఆమె మనల్ని విడిచిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మాటలు రావడం లేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.
జయలలితగారి మరణం తీరని లోటు - నందమూరి బాలకృష్ణ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారి మరణవార్త నన్నెంతో కలిచి వేసింది. సినిమా రంగం, రాజకీయాల్లో జయలలితగారు తనదైన ముద్ర వేశారు. నాన్నగారితో కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన జయలలితగారు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. అలాగే అనేక సవాళ్లతో కూడిన రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఆరు సార్లు ఎన్నిక కావడం చాలా గొప్ప విషయం.
ఎంతో మంది మహిళలకు, పోరాట శక్తికి ఆమె నిదర్శనం. ఇటువంటి లీడర్స్ అరుదుగా ఉంటారు. ఇటువంటి గొప్ప నాయకురాలు మనల్ని విడిచిపెట్టి అనంత లోకాలకు వెళ్లడం ఎంతో బాధాకరం. జయలలితగారి మరణం సినీ రంగానికే కాదు, రాజకీయ రంగానికి కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఐరెన్ లేడీ ఇక లేరు... ముకేష్ అంబానీ
ఉక్కు మహిళ ఇక లేరు. గాడ్ బ్లెస్ తమిళనాడు