Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాట్, సెక్సీ అంటూ కోహ్లి నన్ను తాకరాని చోట తాకాడు... నటి ఫిర్యాదు

సినిమా ఇండస్ట్రీల్లో ఈమధ్య లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని సినీ హీరోయిన్లు చెప్పే మాటలను బట్టి అర్థమవుతుంది. కొందరు మాటల వరకు మాత్రమే పరిమితమవుతుంటే మరికొందరు ఏకంగా పోలీసు కేసు పెట్టేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ వర్థమాన నటి తనను నిర్మాత లైంగిక వేధింపుల

Advertiesment
Mubai Crime
, శనివారం, 25 మార్చి 2017 (13:08 IST)
సినిమా ఇండస్ట్రీల్లో ఈమధ్య లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని సినీ హీరోయిన్లు చెప్పే మాటలను బట్టి అర్థమవుతుంది. కొందరు మాటల వరకు మాత్రమే పరిమితమవుతుంటే మరికొందరు ఏకంగా పోలీసు కేసు పెట్టేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ వర్థమాన నటి తనను నిర్మాత లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ కేసు పెట్టడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 
 
వివరాల్లోకి వెళితే... 'బాబీజీ ఘర్‌ పర్‌ హై' ఫేమ్ శిల్పా షిండే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఆ గుర్తింపు కూడా ఆమె చేసిన షోతోనే వచ్చింది. ఈ షోకు నిర్మాత సంజయ్‌ కోహ్లి. ఇతగాడు శిల్పాను లైంగికంగా వేధించేవాడట. దీనితో అతడి వేధింపులు భరించలేక ఆ షో నుంచి బయటకు వచ్చేసింది. అయినప్పటికీ అతడు తనను వదలకుండా ఫోను ద్వారా హింసిస్తున్నాడనీ, తనను షో చేసే టైంలో హాట్, సెక్సీ అంటూ అనేవాడని పేర్కొంది.
 
ఒకరోజు అతడు తన గ్రీన్ రూములోకి వచ్చాడనీ, షోలో కొనసాగాలంటే తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడనీ, దానికి తను తీవ్రంగా వ్యతిరేకించడంతో షో నుంచి తీసేస్తానన్నాడని తెలిపింది. ఈ వ్యవహారమంతా మేకప్ మేన్ వినడంతో అతడిని పని లోనుంచి తీసేశాడని వెల్లడించింది. అప్పటికీ అతడను తనను వదల్లేదనీ, తనకు సమీపంగా వచ్చి తనను తాకరాని చోట తాకాడనీ, అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ముంబైకి సమీపంలోని వాల్వీ నైగావ్‌ పోలీసు స్టేషన్‌లో ఆమె నమోదు చేసింది. ఐతే కోహ్లి మాత్రం అదంతా అబద్ధమని కొట్టిపారేశాడు. ఆమె తనపై కక్షకట్టిందంటూ ఆరోపిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌కు కొత్త చిక్కు.. రోబో 2.0 కోసమే శ్రీలంకకు కబాలి పర్యటన?