Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Advertiesment
Goldman Raja, Speaker Gaddam Prasad and  Mr. reddy team

దేవి

, గురువారం, 6 మార్చి 2025 (14:33 IST)
Goldman Raja, Speaker Gaddam Prasad and Mr. reddy team
గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారావు-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
ఈ టీజర్‌లోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిన్నతనంలో విడిపోయిన ప్రేమ జంట.. పెద్దయ్యాక మళ్లీ ఎదురు పడితే.. మళ్లీ ఆ ప్రేమ కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో మిస్టర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ‘మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు.. జీవితాన్ని చివరి వరకు కలిసి పంచుకోవడం’ అంటూ చెప్పే డైలాగ్ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో చెప్పేస్తుంది.
 
టీజర్ లాంచ్ ఈవెంట్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. టీజర్ లాంచ్ అనంతరం..
 
స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి టీం చాలా ఎనర్జీతో కనిపిస్తోంది. దర్శకుడు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. హీరో, నిర్మాత నరసింహా రెడ్డి చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మిస్టర్ రెడ్డి సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
 
పట్నం సునీతా రెడ్డి మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి లాంటి చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. చిన్న చిత్రాలే ఇప్పుడు ఎక్కువగా విజయాన్ని అందుకుంటున్నాయి. మిస్టర్ రెడ్డి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
నల్లగొండ గద్దర్ మాట్లాడుతూ .. ‘ఈవెంట్‌కు వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, సునీత గారికి థాంక్స్. హీరో, నిర్మాత నరసింహారెడ్డి నాకు చిన్నతనం నుంచీ పరిచయం. మొదటి నుంచీ ఈయన చాలా వేగంగా దూసుకుపోతూనే ఉంటున్నారు. రంగారెడ్డి నుంచి హీరోగా, నిర్మాతగా ఎదగడం చూస్తే ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
 
హీరో గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నకి, సునీత అక్కకి, నల్లగొండ గద్దర్ అన్నకి థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కొత్త వాళ్లమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలి. మా సినిమా త్వరలోనే రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ .. ‘కొత్త వాళ్లమంతా కలిసి ఈ చిన్న ప్రయత్నం చేశాం. మిస్టర్ రెడ్డి సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను మేం అంతా చాలా కష్టపడి చేశాం. మా లాంటి కొత్త వారు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
మహాదేవ్ మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి సినిమా షూటింగ్ టైంలో చాలా నేర్చుకున్నాను. ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
అనుపమ ప్రకాష్ మాట్లాడుతూ .. ‘మిస్టర్ రెడ్డి లాంటి మంచి చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. వెంకట్ రెడ్డి గారు మా సినిమాను అద్భుతంగా తీశారు. ఇలాంటి సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి