Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్టర్ బచ్చన్ తో హ్యాట్రిక్ కొడుతున్నాం : రవితేజ

Advertiesment
harish shanar, raviteja and egal team

డీవీ

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (10:24 IST)
harish shanar, raviteja and egal team
మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు.  
 
పబ్లిక్ బ్లాక్ బస్టర్ ఈగల్ సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు చాలా ఆనందంగా వుంది. నా పాత్ర మేకోవర్ కి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ కి చాలా ఎక్సయిట్ అయ్యాను.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్ తో వచ్చే మిస్టర్ బచ్చన్ తో హ్యాట్రిక్ కొడుతున్నాం. డేవ్ జాండ్ సౌండ్ ఇరగదీశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. అలాగే మణి చాలా పవర్ ఫుల్ మాటలు రాశాడు. తన పద ప్రయోగం చాలా బావుంది. కావ్య థాపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. తనకి బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది.  కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను. ఎవరినో చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ అద్భుతమైన విజన్ కలిగిన దర్శకుడు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశాడు. తను టాప్ డైరెక్టర్ అవుతాడు. అనుపమ, అజయ్ ఘోస్, వినయ్ రాయ్ అందరూ తమ పాత్రలని పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.
 
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ..ఈగల్ అద్భుతమైన చిత్రం. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇలాంటి పాయింట్ ని ఇంత స్టయిల్ గా తీయడం కార్తిక్ కే సాధ్యపడింది. డేవ్ జాండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ధమాకా, ఈగల్, ప్రస్తుతం నేను చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' ఇలా మూడు డిఫరెంట్ సినిమాలు రవితేజ గారికి అందించిన  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. కార్తిక్ మైండ్ బ్లోయింగ్ టేకింగ్ తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా సినిమా తీశాడు'' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను సిద్ధమే.. అవకాశాలే రావడం లేదు : హీరోయిన్ సమంత