Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాటమరాయుడులో అంత సత్తా లేదా? వందకోట్ల రికార్డుకు ఇంత కక్కుర్తా?

మీ రికార్డుల సాధనకు, అభిమానుల్లో ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఇంత కక్కుర్తి పడతారా అంటూ కాటమరాయుడు చిత్ర నిర్మాణ సంస్థపై ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ మండిపడింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే జనాల్లో ఉన్న క్రేజీని సొమ్ము చేసుకోవాలని కాటమరాయుడు

కాటమరాయుడులో అంత సత్తా లేదా? వందకోట్ల రికార్డుకు ఇంత కక్కుర్తా?
హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (07:33 IST)
మీ రికార్డుల సాధనకు, అభిమానుల్లో ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ఇంత కక్కుర్తి పడతారా అంటూ కాటమరాయుడు చిత్ర నిర్మాణ సంస్థపై ఆల్ ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ మండిపడింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే జనాల్లో ఉన్న క్రేజీని సొమ్ము చేసుకోవాలని కాటమరాయుడు సినిమా టిక్కెట్ల ధరను పెంచడాన్ని అసోసియేషన్ తీవ్రంగా నిరసించింది. 
 
విషయం ఏమిటంటే వంద కోట్ల క్లబ్బులో ఎలాగైనా చేరాలనే దుగ్ధ, మొదటి మూడు రోజుల్లోనే 30 కోట్లు సంపాదించలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా తెలుగు సినీ నిర్మాతలు, హీరోలు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈక్రమంలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పది రూపాయల టిక్కెట్టును 50కి, అలాగే 50 రూపాయల టిక్కెట్చును 200లకు, 150 రూపాయల టిక్కెట్టును 500లకు పెంచి లూటీ చేయడం ప్రతి అగ్రహీరో సినిమాకు అలవాటైపోయింది. 
 
తమ లాభాలకోసం జనాల జేబులను లూటీ చేస్తున్న ఈ అక్రమాన్ని అరికట్టాలని కోరుతూ ఆల్ఇండియా మూవీ గోయర్స్ అసోసియేషన్ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. కాటమరాయుడు సినిమా టిక్కెట్లను అడ్డంగా పెంచేసిన ఘటనపై మండిపడిన అసోసియేషన్.. పవన్ కల్యాణ్‌ది లూటీ చేసే సిద్ధాంతమని సంఘ సభ్యులు ఆరోపించారు.
 
పైగా ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ వవన్ కల్యాణ్  తన పబ్బం గడుపుకుంటున్నారని అసోసియేషన్ ఆరోపించింది. బెనిఫిట్ షోల సాకుతో కొత్త సినిమాకు సంబంధించి ఒక్కో టిక్కెట్లు ధరను 5 వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. ఈ సమస్యపై అటో ఇటో తేల్చేంతవరకు పోరాడతామని వివరించింది.
 
కాటమరాయుడు సినిమాను సింగిల్‌గా టార్గెట్ చేయటం కంటే కొత్త సినిమా విడుదలైన మూడు రోజుల్లో ఇలాంటి లూటీ పద్ధతులకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏ చిత్ర నిర్మాతా, హీరో ఇలాంటి తప్పుడు పనులకు పాటుపడరు కదా.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందాలారబోశాను నిజమే... అందుకుని మొత్తం విప్పేయాలా: రకుల్