Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటక బాహుబలి.. అమ్మ కోసం 45 అడుగుల బావినే తవ్వాడు.. మదర్స్ డే కానుకగా ఇచ్చాడు!

Advertiesment
Mother's Day special: In drought-hit Karnataka
, సోమవారం, 9 మే 2016 (10:37 IST)
మాతృదినోత్సవం సందర్భంగా ఓ కుర్రాడు బాహుబలి అనిపించుకున్నాడు. బాహుబలి సినిమాలో మొక్కు కోసం తల్లి జలపాతం దగ్గరి నుంచి కుండతో నీళ్లు తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేస్తుంటుంది. అలా తల్లి కష్టం చూడలేని ఆ హీరో శివలింగాన్ని జలపాతం వద్దకే చేర్చుతాడు. అయితే ఈ కుర్రాడు నీటి కోసం తల్లి కష్టాలు చూసి.. బావిని ఇంటి వద్దే తవ్వాడు. తద్వారా మదర్స్ డే సందర్భంగా నీటితో కూడిన బావిని తల్లికి కానుకగా ఇచ్చాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరువుతో అల్లాడుతున్న కర్ణాటకలోని శెట్టిసార గ్రామంలో కరువు కారణంగా కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి ఉంది. కిలోమీటర్ల పాటు నడుస్తూ వెళ్లి నీళ్లు తెచ్చే తల్లి కష్టాన్ని చూసిన పవన్ అనే కుర్రాడు.. ఇంటి ప్రాంగణంలోనే బావిని తవ్వాడు. సుమారు ఆరు వారాలు కష్టపడ్డాడు. 
 
ఒక్కడే 45 అడుగుల లోతు తవ్వాడు. ఈ ప్రయత్నంలో అతనికి చేయి కూడా విరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూలీలతో పనిని పూర్తి చేసి.. అమ్మకు తవ్విన బావిని కానుకగా అందజేసి.. ఇక నీటి కోసం కష్టాలు అక్కర్లేదని తేల్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా రోగి పడకపై కాలుపెట్టిన ఐఏఎస్ అధికారి.. ఫేస్‌బుక్‌లో క్షమాపణలు