సూపర్‌స్టార్ కృష్ణ నటించిన తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు. అప్పట్లో ఈ సినిమాకు ఆదరణ అంతా ఇంతాకాదు. కౌబాయ్‌గా కృష్ణకు పేరు వచ్చింది. కృష్ణ ఏంచేసినా ప్రయోగాలు చేసేవారు. సాంఘిక, పౌరాణికం, కౌబాయ్, సస్పెన్స్ థ్రిల్లర్, కలర్ సినిమా, స్కోప్ సినిమా వంటివన్నీ తీసి డేర్‌గా ముందుకు సాగారు.
ఇప్పుడు ఆయన జయంతి సందర్భంగా మే 31 మోసగాళ్ళకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అప్పటి మూవీని డిజిటలైజ్ చేసి 4కె. వర్షన్‌లో మార్చి వరల్‌వైల్డ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పద్మాలయా మూవీస్‌పై రూపొందిన ఈ సినిమా వారే దీనిని మరలా రిలీజ్ చేయనున్నారు.